స్వామి వారి నిత్యాన్నదానం కోసం రూ. 2,00,116/- విరాళం

సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్యాన్నదానం కోసం రూ. 2,00,116/- విరాళం



​సింహాచలం శ్రీ శ్రీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి నిత్య అన్నప్రసాద వితరణ పథకానికి ఒరిస్సా రాష్ట్రం, పర్లాకిమిడికి చెందిన భక్తులు ఉదారంగా విరాళం అందించారు.



​పర్లాకిమిడి నివాసితులైన శ్రీ బళ్ల సింహాచలం, శ్రీమతి పద్మావతి దంపతులు రూ. 1,00,116/- (ఒక లక్ష నూట పదహారు రూపాయలు), వారి కుమారుడు శ్రీ బళ్ల మధు, శ్రీమతి లావణ్య దంపతులు రూ. 1,00,000/- (ఒక లక్ష రూపాయలు) కలిపి మొత్తం రూ. 2,00,116/- (రెండు లక్షల ఒక వంద పదహారు రూపాయలు) విరాళాన్ని అందజేశారు. ఈ మొత్తాన్ని వారు డిమాండ్ డ్రాఫ్ట్ (DD) రూపంలో దేవస్థానం ప్రోటోకాల్ ఆఫీస్ నందు ప్రోటోకాల్, పర్యవేక్షణాధికారి  పూసపాటి సునీల్ కుమార్, ప్రోటోకాల్ సీనియర్ సహాయకులు  వి. సూర్యనారాయణ లకు సమర్పించారు. దాతలు తమ విరాళంపై వచ్చే వడ్డీతో సంవత్సరంలో ఒక రోజు శ్రీ స్వామివారి ప్రసాదాన్ని భక్తులకు అందించవలసిందిగా ఆలయ అధికారులను కోరారు. అనంతరం, ఆలయ అధికారులు దాత కుటుంబ సభ్యులకు శ్రీ స్వామివారి ప్రత్యేక దర్శనం కల్పించి, ఆలయ పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు స్వామి వారి ప్రసాదాలను అందజేశారు. దాతల దాతృత్వాన్ని దేవస్థానం అధికారులు అభినందించారు.