సింహాచలం దేవస్థాన ఈవోగా బాధ్యతలు స్వీకరించిన శ్రీమతి ఎన్. సుజాత
శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహాచలం కార్యనిర్వహణాధికారిగా (FAC) బాధ్యతలు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీమతి ఎన్. సుజాత గారు శుక్రవారం అధికారికంగా స్వీకరించారు.
ఈ సందర్భంగా ఇఓ శ్రీమతి సుజాత మొదటగా శ్రీ అప్పన్న స్వామివారిని దర్శించుకుని, ఆలయ పరిధిలో కప్పస్థంభం ఆలింగనం చేసి, బేడా ప్రదక్షిణం నిర్వహించారు. అనంతరం స్వామివారి ప్రధానాలయంలో దర్శనం చేసుకుని వేదపండితుల వేదాశీర్వచనాలు స్వీకరించారు.
అనంతరము ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు గారు మరియు అడ్మినిస్ట్రేటివ్ సహాయ కార్యనిర్వహణాధికారి వాడ్రేవు రమణమూర్తి , ఈ ఓ శ్రీమతి సుజాత గారికి స్వామివారి పటము, ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో ఆలయ పర్యవేక్షణాధికారులు, వైదిక సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.



