నమో నరసింహ దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహాలక్ష్మీనృసింహస్వామి వారి దేవస్థానం అందు వైభవంగా శ్రీ స్వామివారి స్వర్ణ తులసీదళార్చన..
సింహాచలం: తులసీదళార్చన ఆలయ వైదిక సిబ్బంది ఆలయ అధికారులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తముగా శ్రీ స్వామివారికి 108 బంగారు పుష్పాలతో అత్యంత వైభవంగా స్వర్ణ తులసీదళార్చన.
స్వర్ణ తులసీదళార్చనలో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వర్ణ తులసీదళార్చన వైభవంగా జరిగింది, సింహాచల పుణ్య క్షేత్రములో దేవస్థాన వేదపండితుల వేదమంత్రాల, నాదస్వర మంగళ వాయిద్యాలతో శాస్త్రోక్తంగా స్వర్ణ తులసీదళార్చన వైభవంగా నిర్వహించారు. అర్చకులు వేకువ జామున స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి ప్రాతఃకాల పూజలు సాంప్రదాయ బద్దంగా నిర్వహించారు.
శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ గోవింద రాజు స్వామి వారిని సర్వాంగ సుందరంగా అలంకరించి ఆలయ కల్యాణ మండపములో వేదికపై అధీష్టింప జేసి వేద మంత్రాలు నాధ స్వర మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి వారి స్వర్ణ తులసీదళార్చన, సేవ వైభవంగా నిర్వహించారు.
ప్రత్యక్షంగా భక్తులు శ్రీ స్వామి వారి ఆర్జిత సేవలలో పాల్గొని తరించారు.