కేంద్ర ఆయుష్ మంత్రిని కలిసిన రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌళిశాఖ మంత్రివర్యులు శ్రీమతి సవితమ్మ



న్యూఢిల్లీ: కేంద్ర ఆయుష్ శాఖ మంత్రి శ్రీ ప్రతాప్ రావు జాదవ్ గారిని శ్రీమతి సవితమ్మ గారు మర్యాదపూర్వకంగా ఢిల్లీ లో  కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీసీ సంక్షేమ హాస్టల్ లోని విద్యార్థుల ఆరోగ్య అభివృద్ధి కోసం ప్రతిపాదించిన ప్రాజెక్ట్ ఆరోగ్య బాల ఆయుర్ ఆంధ్ర ఇనిషియేటివ్ పై వినతి పత్రాన్ని కేంద్రమంత్రికి మంత్రి సవితమ్మ సమర్పించారు.



ఈ ప్రాజెక్టు కింద పోషకాహార లోపాలతో బాధపడుతున్న జిల్లాల్లోని బీసీ హాస్టల్లో విద్యార్థులకు ముఖ్యంగా కిషోర్ వయస్సు, బాలికలకు అశ్వగంధ శతావరి, బ్రహ్మీ, తులసి శంకు పుష్పి, వంటి ఆయుర్వేదిక మూలికలతో తయారిన హెర్బల్ న్యూట్రిషన్ సప్లిమెంటును అందించనున్నారు.



ఇది FSSAI ప్రమాణాలకు అనుకూలంగా ఉండి భోజన ప్రణాళికలతో సమన్వయం చేస్తూ ఆరోగ్యపరంగా శాస్త్రీయంగా రూపొందించబడినదని తెలిపారు. ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య లక్ష్యాలు విద్యార్థులు పోషకహార లోపాల నివారణ రోగనిరోధక శక్తి పెంపు మానసిక అభివృద్ధి ఏకాగ్రత మెరుగుదల ఆయుర్వేదం ఆధారిత ఆరోగ్య సంస్కృతి ప్రోత్సహిస్తుందని తెలిపారు. 



ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆయుర్ ఆంధ్ర దృష్టికి అనుగుణంగా రాష్ట్రంలోని బీసీ విద్యార్థులకునూతన  ఆయుర్వేదం ఆధారిత పోషకఆహారాలను  అందించేదుకు ఈ ప్రాజెక్టు కీలమైన అడుగని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఈ వినతిని కేంద్రమంత్రి గౌరవంగా స్వీకరించి అన్ని విధాలుగా పరిగణమిస్తామని హామీ ఇచ్చినట్లు మంత్రి సవితమ్మ తెలిపారు.