క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన మిత్రులు..

ఆరోగ్యమే మహాభాగ్యం మన ఆరోగ్యం మన చేతుల్లోనే క్రికెట్ ప్రేమికులు.. 
వైభవంగా ముగిసిన మిత్రుల క్రికెట్ టోర్నమెంట్.



క్రికెట్ మిత్రుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న  ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంటును మిత్రులు ప్రారంభించారు. ఆదివారం నారపల్లిలో ఇంజనీరింగ్ కళాశాల క్రీడా మైదానంలో మిత్రులు నాలుగు టీమ్స్ తో ప్రారంభించారు. మొదటి మ్యాచ్ శ్రీనివాస్ టీం సంతోష్ టీం అడగా శ్రీనివాస్ టీం విజయవంతంగా నిలిచారు. రెండవ మ్యాచ్ ప్రవీణ్  టీం వేణు టీం అడగా ప్రవీణ్ టీం విజయవంతంగా నిలిచారు, ఆ తరువాత ఫైనల్ మ్యాచ్ శ్రీనివాస్ ప్రవీణ్ టీం అడగా ప్రవీణ్ టీం వనస్థలిపురం 12 రన్స్ తో విజేతగా నిలిచారు అనంతరం క్రీడాకారులనుద్దేశించి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ క్రీడల వల్ల స్నేహసంబంధాలు పెరిగి ఆరోగ్యంగా ఉంటారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిపోయినావారు నిరుత్సాహ పడకుండా మళ్లీ గెలిచేందుకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్, సంతోష్, శ్రీనివాస్, వేణు, వీరేందర్, సురేష్, ప్రవీణ్, రాజేష్, రఘు, మురళి, కృష్ణ, ఓంకార్ తదితరులు పాల్గొని క్రికెట్ ఆడుతూ సంతోష వ్యక్తంచేశారు.