సిపిఎం నాయకుల హెచ్చరిక

స్మార్ట్ మీటర్లు రద్దు చేయకపోతే మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతాం....సిపిఎం నాయకుల హెచ్చరిక 



రాష్ట్రంలో ఉన్న టిడిపి కూటమి ప్రభుత్వం (డబల్ ఇంజనీర్ సర్కార్ ) ప్రజల ఇండ్లకు స్మార్ట్ మీటర్లు పెట్టడాన్ని ఉపసంహరించుకోకపోతే మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈరోజు కర్నూల్ నగరంలోని స్థానిక విద్యుత్ సౌదా మందు వందలాదిమంది ప్రజలతో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బైఠాయింపు చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం న్యూ సిటీ కార్యదర్శి టి రాముడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం జిల్లా కార్యదర్శి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల కంటే ముందు బాదుడే బాదుడు అని బ్యానర్ పట్టుకుని స్మార్ట్ మీటర్లు వస్తే తగలబెట్టండి పగలగొట్టండి మీ వెంట మేమున్నామని చెబుతూ మేము అధికారంలోకొస్తే ఒక్క పైసా కరెంటు చార్జీలు పెంచము స్మార్ట్ మీటర్లు తీసుకుని రాము అని ప్రజలకు హామీ ఇచ్చిన విషయం ప్రజలందరికీ తెలుసు అని ఆయన తెలిపారు.



వీళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ కంటే మేమేఘనులమని చెప్పి ఈ సంవత్సరకాలంలో దాదాపు 20 వేల కోట్ల రూపాయలు సర్దుబాటు చార్జీల పేరుతో, సర్చ్ చార్జీలు పేరుతో భారం వేయడమే కాకుండా కొత్తగా స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకురావడానికి సిపిఎం పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందని ఆయన విమర్శించారు. ప్రజలు కూడా స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చాడు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం 2022 లో విద్యుత్ సంస్కరణలు తీసుకుని వచ్చిన తర్వాత బిజెపి పాలిత రాష్ట్ర ప్రభుత్వాలు కూడా సహసించని కార్యక్రమాన్ని నాడు జగన్ ప్రభుత్వం చేపట్టడం వల్ల ప్రజలు బుద్ధి చెప్పి ఇంటికి పంపించారని ఆయన విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో 2000 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు విద్యుత్ సంస్కరణలు తీసుకు వచ్చిన తర్వాత సంస్కరణలకు వ్యతిరేకంగా నాడు విద్యుత్ ఉద్యమం చేపట్టి ముగ్గురు కార్యకర్తలు బలిదానం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి ప్రజలు అధికారానికి చాలా దూరంగా పెట్టిన విషయాన్ని చంద్రబాబు నాయుడు గమనించాలని ఆయన ఘాటుగా విమర్శించారు. 



నాడు బుద్ధి చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడుకి జ్ఞానోదయం కలగలేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందని కార్పొరేట్ కంపెనీ ఆదానికి ఊడిగం చేయడం కోసం మాత్రమే స్మార్ట్ మీటర్ల విధానాన్ని తీసుకుని వచ్చాడని ఆయన విమర్శించాడు. ఓట్లు వేసింది ప్రజల ఆదానీన చంద్రబాబు నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన విమర్శించారు. అలాంటప్పుడు ఎన్నికల ముందు ప్రజలకు ఎందుకు మోసపు మాటలు చెప్పారు. ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశాడు. స్మార్ట్ మీటర్లు అంటేనే ప్రీపెయిడ్ విధానాన్ని తీసుకురావడం అనేది చాలా స్పష్టమని ఆయన తెలిపారు. ఇప్పటికే కమర్షియల్ కాంప్లెక్స్ లు, ప్రభుత్వ కార్యాలయాల్లో స్మార్ట్ మీటర్లు పెట్టిన చోట ఇప్పుడున్న బిల్లు కంటే రెట్టింపు వస్తున్నాయని దానివల్ల ప్రజలు వ్యాపారస్తులు ఆందోళన చెందుతున్నారని ఆయన తెలిపారు. ఈ స్మార్ట్ మీటర్లకు తయారయ్యే ఖర్చు అంతా ప్రజలే భరించేలా సింగల్ ఫేస్ కైతే 8927 రూపాయలు, త్రీ ఫేస్కు అయితే 17,286 రూపాయలు ప్రజలే 93 నెలల్లో తన బిల్లుల ద్వారా చెల్లించాలని ఈ రకంగా ప్రజలకు తెలియకుండా ప్రజల నెత్తిమీద పదివేల నుంచి 17 దాకా భారాలు వేస్తున్నారని ఆయన తెలిపారు. 



ఈ భారాలు వేయడం కోసమేనా ప్రజలు చంద్రబాబు నాయుడు కి ఓటు వేసి గెలిపించింది? రాత్రి ఒక రేటు పగలు ఒకరేటు మధ్యాహ్నం ఒకరేటు నిర్ణయించడం కోసమేనా పవన్ కళ్యాణ్ కి ఓటు వేసి గెలిపించింది. గంటకొక రేటు నిర్ణయించడం కోసం మేన లోకేష్ కి ఓటేసి గెలిపించింది దీనికి కూటమి నాయకులు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రీ పెయిడ్ విధానమంటేనే సెల్ఫోన్ కు ఏ రకంగా రీఛార్జ్ చేసుకుంటామో రాబోయే కాలంలో ప్రజలు విద్యుత్ సంస్థతో సంబంధం లేకుండా తమ సెల్లుకు రీఛార్జ్ చేసుకునే విధానం వల్ల ప్రజలకు తీవ్రమైన నష్టం జరుగుతుందనీ, రాష్ట్రంలో వందలాదిమంది ఉన్న మీటర్ రీడర్ల ఉపాధి పోతుందని కొత్త ఉపాధి ఇవ్వకపోయినా ఉన్న ఉపాధిని ఊడగొట్టడం కోసమేనా టిడిపి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు మేల్కొని స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సిపిఎం పార్టీ ప్రజలను అపీలు చేస్తుంది. మీ ఇంటి దగ్గరికి మీటర్ మార్చడం కోసం వస్తే తిరస్కరించండి మీరు ఏ పేరు చెప్పినా కొత్త మీటర్లు పెట్టుకోవద్దు . రాబోయే కాలంలో సిపిఎం పార్టీ ఇతర మహపక్ష పార్టీలు ప్రజాసంఘాలతో కలిసి గతంలో చేసిన విద్యుత్ ఉద్యమం లాగా మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడుతుందని ఆ ఉద్యమానికి ప్రజలు బలపరచాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు బి నిర్మల గారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి 2000 సంవత్సరంలో విద్యుత్ పోరాటం ద్వారా బుద్ధి చెప్పినప్పటికీ జ్ఞానోదయం కలగలేదని మరి అలాంటి తప్పే ఇప్పుడు చేస్తున్నాడని ఆమె విమర్శించారు స్మార్ట్ మీటర్లు వద్దు ప్రజలకు భారం అవుతాయి అని చెప్పిన ఆయనే నేడు ఉలుకు పలుకు లేకుండా మౌనంగా ఉంటూ కంపెనీ వాళ్ళను అధికారులను ప్రోమాయించి స్మార్ట్ మీట్లను దొంగతనంగా పెట్టడం సరైన పద్ధతి కాదని దీనివల్ల ప్రజలకు మోయలేని భారం పడుతుందని ఆమె తెలిపారు. పరిపాలన చేతగానప్పుడు రాజీనామా చేసి వెళ్లిపోవడం మంచిదని ప్రజలపై భారం వేసే అధికారం మీకు ఎవరిచ్చారు అని అంత ధైర్యం ఉంటే ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే భారాలు వేస్తామని ఎందుకు చెప్పలేదని ఆమె ఘాటుగా విమర్శించారు. నాడు జగన్ నేడు చంద్రబాబు ఇద్దరూ ఈ రాష్ట్ర ప్రజలను భారం వేసే వాళ్లే తప్ప రాష్ట్ర ప్రజలకు మేలు చేసింది శూన్యమని ఆమె విమర్శించారు ఇప్పటికే నిత్యవసర వస్తువుల ధరలు పెరిగి పనులు లేక చాలీచాలని ఆదాయాలతో బతికే ప్రజలపై స్మార్ట్ మీటర్ బాంబు ప్రజలపై వేయడం ప్రజల జీవితాలతో చలగాటమాడమేనని ఆమె ఘాటుగా విమర్శించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే స్మార్ట్ మీటర్లు మేము పెట్టము అని చెప్పిన మాట ప్రకారం స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం సిపిఎం పార్టీ ఓల్డ్ సిటీ కార్యదర్శి ప్రసంగిస్తూ సర్దుబాటు చార్జీలు సర్చార్జీల పేరుతో భారం వేయడమే కాకుండా కొత్తగా స్మార్ట్ మీటర్ల పేరుతో అదనపు భారం వేయడం బూర్షా పార్టీలకు నైజం అని అందుకోసమే ప్రజలు మేలుకోవాలని స్మార్ట్ మీటర్లను తిరస్కరించాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారుల నుండి స్పష్టమైన సమాధానం రాకపోవడంతో ప్రజలు రోడ్డుమీద బైఠాయించారు. విద్యుత్ అధికారులు ప్రజలకు తెలియకుండా మీటర్లు పెట్టము వాళ్ళు అనుమతిస్తేనే మీటర్లు పెడతాము అని స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాత ఆందోళన విరమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా నాయకులు అలివేలమ్మ నగేష్ గురు శేఖర్ నగర నాయకులు విజయ్ నరసింహులు సుధాకరప్ప సాయి బాబా షరీఫ్ అబ్దుల్లా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.