శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు పట్టణ పరిధిలో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బుచ్చిరెడ్డిపాలెం ఇందుకూరుపేట కొవ్వూరు విడవలూరు కొడవలూరు మండలాల మైనార్టీ నేతలు పాల్గొని ప్రసంగించారు.
ఈ నెల ఏడో తేదీ వైఎస్ఆర్సిపి కోవూరు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ రెడ్డి ప్రస్తుత శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ని వ్యంగంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని వ్యక్తిగతంగా విమర్శిస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడని వాటిని వెంటనే ఉపసంభించుకుని క్షమాపణ చెప్పాలని లేనిచో నియోజకవర్గంలోని మహిళలు నియోజకవర్గంలో తిరగకుండా అడ్డుకుంటారని ఇది మంచి పద్ధతి కాదని ఇకనైనా మంచి బుద్ధి ప్రసాదించాలని దేవుని అడుగుతున్నామని అన్నారు.