విశాఖ వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకుల నిరసన సేగలు..

నిరసన కార్యక్రమంలో పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు పేడాడ రమణికుమారి...



ఈ రోజు విశాఖపట్నం జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం దగ్గర విశాఖపట్నం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు కే.కే.రాజు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు.



ఈ సందర్భంగా సుమారు రూ.5,000 కోట్ల విలువగల 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని, విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులకు సంబంధించిన గీతం విద్యా సంస్థకు రెగ్యులరైజేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు జరిగే జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో అజెండాగా చేర్చి, తీర్మానం చేసి, ప్రభుత్వానికి పంపించి క్రమబద్ధీకరణ చేయడానికి జరుగుతున్న కుట్రను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం చేపట్టామని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులు కే.కే.రాజు మీడియాకు తెలిపారు.



ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ, ఉత్తరాంధ్ర రీజినల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రివర్యులు  కురసాల కన్న బాబు, మాజీ ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి, అనకాపల్లి జిల్లా పార్టీ అధ్యక్షులు గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, శాసనమండలి సభ్యురాలు మరియు వైఎస్ఆర్సిపి రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, ఎమ్మెల్సీ రవీంద్రబాబు, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సిపి జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజవర్గ సమన్వయకర్త  మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను), విశాఖ జిల్లా పరిషత్ చైర్ పర్సన్ శ్రీమతి జల్లిపల్లి సుభద్ర, సమన్వయకర్తలు, మాజీఎమ్మెల్యేలు, మాజీ మేయర్ డిప్యూటీమేయర్, రాష్ట్ర, మాజీ జిల్లా వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, జీవీఎంసీ కార్పొరేటర్, రాష్ట్ర పార్టీ కార్యవర్గం సభ్యులు నగర జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, మాజీ రాష్ట్ర జిల్లా వివిధ కార్పొరేషన్ డైరెక్టర్, వార్డు అధ్యక్షులు, ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.