పల్లా శ్రీనివాస్‌కు బంపర్ ఆఫర్!

పల్లా శ్రీనివాస్‌కు బంపర్ ఆఫర్! 

నిర్ణయం ఆయన చేతుల్లోనే...



ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న తరుణం ఆసన్నమైందని రాజకీయ వర్గాలు వెల్లడిస్తున్నాయి. గాజువాక నియోజకవర్గంలోనూ, రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనూ విశేష ఆదరణ పొందిన పల్లా శ్రీనివాసరావుకు మంత్రిపదవి ఖరారయ్యే అవకాశాలు బలపడుతున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీని మరింత పటిష్టంగా తీర్చిదిద్దుతూ, విభేదాలకు తావులేకుండా అందర్నీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లిన నాయకుడిగా పల్లా శ్రీనివాస్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. పార్టీ బలోపేతానికి చేసిన సేవలకు గానూ, ఎప్పుడో రావాల్సిన మంత్రి పదవి ఇప్పుడు కార్యరూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానమైన మూడు కీలక శాఖలను అధిష్టానం సూచించినట్లు తెలుస్తోంది. తుది నిర్ణయం మాత్రం పల్లా శ్రీనివాస్ చేతుల్లోనే ఉందని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ఏది ఏమైనప్పటికీ, గాజువాక తెలుగు తమ్ముళ్లకు మాత్రమే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం పార్టీ శ్రేణులు, పల్లా అభిమానులకు ఇది నిజంగా పండగ వాతావరణం అని చెప్పవచ్చు.