పటిష్ట భద్రత నడుమ ఈవీఎం, వీవీప్యాట్ గోదాములు, ఈవీఎం, వీవీప్యాట్ గోదాము వద్ద నిరంతర పర్యవేక్షణ: జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి.
ముమ్మిడివరం మార్చి 25: బ్యాక్ టు బ్యాక్ న్యూస్: ఈవీఎం, వీవీప్యాట్ల గోదాముకు పకడ్బందీ భద్రత కల్పించడం జరిగినప్పటికి నిరంతర పర్యవేక్షణతో అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ టి. నిశాంతి అదేశించారు. బుధవారం స్థానిక ఎయిమ్స్ కళాశాల మూడో అంతస్తు నందు భద్రపరిచిన ఈవీఎం వివి ప్యాట్ గోదాములను ఆమె భారత ఎన్నికల సంఘం నిబంధన లకు అనుగుణంగా రెవెన్యూ పోలీస్ అగ్నిమాపక భద్రతా సిబ్బంది రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి తనిఖీ నిర్వహించారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆదేశాలు, మార్గదర్శకాలకు అనుగుణంగా సీసీ కెమెరాల పనితీరుతో పాటు అగ్నిమాపక విద్యుత్ పరికరాలను పరిశీ లించి అనంతరం పర్యవేక్షణ రిజిస్టర్లో సంతకం చేశారు. ఈ సందర్భంగా జిల్లా సంయుక్త కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈవీఎం, వీవీప్యాట్లను భద్రప రుస్తున్న గోదామును క్షుణ్ణంగా తనిఖీ చేసి ఎప్పటికప్పుడు సమగ్ర నివేదికను అందించడం జరుగుతోందన్నారు.
అదేవిధంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనూ మూడు నెలలకు ఒక సారి (త్రైమాసిక) తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గోదాము వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ సీసీ కెమెరాల పర్యవేక్షణతో గట్టి నిఘా ఉంచాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అధికారులకు సూచించారు.
ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు ప్రకారం మూడు నెలల తనిఖీల్లో భాగంగా ఈవీఎం భద్రపరిచిన గోడౌన్ భద్రతకు తీసుకుంటున్న చర్యలను ఆమె పరిశీలించారు. అదేవిధంగా సీసీ కెమెరాలు వ్యవస్థను ఫైర్ సేఫ్టీ 24 గంటలు భద్రత ఏర్పాట్లను జెసి స్వయంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈవీఎం భద్రత లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని భద్రత నిబంధనలపై అధికారులు కఠినంగా వ్యవహరించాలని ఆమె స్పష్టం చేశారు.
ఈవీఎం, వీవీప్యాట్ల గోదాము తనిఖీలో జిల్లా జాయింట్ కలెక్టర్ తో పాటు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ తరఫున వడ్డీ నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ తరపున డి. రమణ కుమార్ ఉప తాహసిల్దార్ శివరాజ్, సిబ్బంది బాబ్జి తదితరులు పాల్గొన్నారు.



