ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర (APSRTC )చైర్మన్ దొన్ను దొర ని కలసి ఆదివాసీ గిరిజన ప్రాంతంలో మారుమూల గ్రామాలకు మెరుగైన బస్సు సౌకర్యాలు కల్పించాలని కోరిన బీజేపీ నేత దుక్కేరి. ప్రభాకరరావు...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం సీఎం నారా.చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటంతో ఎన్నికల్లో నాయకులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గం నుండి టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు దొన్ను దొర ను APSRTC చైర్మన్ గా నియమించటంతో ఆదివాసీ గిరిజనులు చాలా సంతోసిస్తున్నారనీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం కు కృతజ్ఞతలు తెలుపుతున్నారనీ బీజేపీ నేత దుక్కేరి. ప్రభాకరరావు తెలిపారు. ఆయన APS RTC చైర్మన్ దొన్ను దొర ను కలిసి ఆదివాసీ గిరిజన ప్రాంతంలో APS RTC సేవలు మారుమూల గిరిజన గ్రామాలకు కూడా మెరుగైన బస్సు సౌకర్యం కల్పించే దిశగా చూడాలని కోరారు. అతి ముఖ్యంగా మారుమూల ప్రాంతాల్లో ప్రయాణించే స్త్రీలు మరియు వృద్దులు చిన్నారులు, ఉద్యోగస్తులు అత్యవసర వైద్యం, విద్య కొరకు సాయంత్రం సమయాల్లో తమ గ్రామాలకు చేరుకోలేక, పట్టణాలకు చేరుకోవటానికి సొంత వాహనాలు లేక, మరియు ప్రైవేట్ వాహనాలు తిరగని గ్రామాలు చాలా ఉన్నాయని వాటిని గుర్తించి ఆదివాసీ గిరిజన ప్రజలకు APSRTC బస్సు సౌకర్యలు అందుబాటులోకి తీసుకోని రావాలని, తద్వారా ప్రజలు కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటారని అన్నారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒకటి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని మహిళలందరు చాలా సక్కగా సద్వినియోగపరుచుకుంటున్నారనీ, ఈ ఉచిత బస్సు ప్రయాణం వలన గృహిణులు నిత్యవసర అవసరాల నిమిత్తం ఒకరోజులో అనేకమర్లు బయటకి వచ్చిన ప్రతి సారి ప్రయాణ ఖర్చు అధికంగా ఉండేదాని కానీ కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం వల్ల మాకు డబ్బులు అదా అవుతున్నాయని ఆ ధనంతో మా కుటుంబ పోషణ అవసరాలు తీర్చుకొని మెరుగైన జీవనం సాగిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళలు ఆనందాన్ని వేక్తిపరుస్తున్నారనీ అన్నారు. APSRTC చైర్మన్ దొన్ను దొర స్పందిస్తూ ఆదివాసీ గిరిజన మారుమూల గ్రామాలల్లో బస్సు సౌకర్యం కల్పించే విషయంలో ఎక్కడ ప్రజలు ఇబ్బంది పడిన బస్సు సౌకర్యం కల్పించటం కోసం ఎక్కడ రాజీ పడనని అన్నారు. తప్పకుండ మెరుగైన బస్సు సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.
