సింహాచలం చందనోత్సవం మీడియా పాస్‌ల వివాదం

సింహాచలం చందనోత్సవం మీడియా పాస్‌ల వివాదం: చిన్న పత్రికలపై, డిజిటల్ మరియు  సోషల్ మీడియాపై వివక్ష? అధికారుల తీరుపై జర్నలిస్టుల ఆగ్రహం!



విశాఖపట్నం పుణ్యక్షేత్రం సింహాచలంలో అంగరంగ వైభవంగా జరిగే శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి చందనోత్సవం వేళ కొత్త వివాదం చెలరేగింది. ప్రతి ఏటా భక్తులకు సమాచారాన్ని అందించడంలో కీలక పాత్ర పోషించే చిన్న పత్రికలు, వారపత్రికలు, డిజిటల్ మరియు సోషల్ మీడియా పట్ల అధికారులు అనుసరిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది.
ప్రదానంగా పాస్‌ల నిరాకరణ: కేవలం ప్రధాన మీడియా సంస్థలకే ప్రాధాన్యత ఇస్తూ, చిన్న పత్రికలకు మీడియా డ్యూటీ పాస్‌లు ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. దీనిపై ప్రశ్నార్థకమైన పారదర్శకత చోటు చేసుకుంది. "ఫోటోలు, వీడియోలు మేమే ఇస్తాం" అని సమాచార శాఖ అధికారులు చెబుతుండటంపై విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో లోపాలు జరిగితే వాటిని ఎత్తిచూపేదెవరు? ప్రభుత్వ ఫోటోలతో పారదర్శకత ఎలా సాధ్యం? అని జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.
  • హెచ్చరిక: అన్ని వర్గాల పత్రికలకు, డిజిటల్ మరియు సోషల్ మీడియాకు సమాన అవకాశం కల్పించకపోతే, ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని మీడియా ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.
సింహాచలం అప్పన్న స్వామి సేవలో మీడియా పాత్ర ఎంతో కీలకం. భక్తులకు నిజమైన సమాచారాన్ని తక్షణమే చేరవేయడంలో సోషల్ మరియు డిజిటల్ మీడియా, పత్రికల కృషిని విస్మరించడం సమంజసం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.