విశాఖ షిప్ యార్డ్‌లో ముగిసిన అగ్నిమాపక వారోత్సవాలు.. అవగాహనతోనే అగ్నిప్రమాదాలకు చెక్!

విశాఖ షిప్ యార్డ్‌లో ఘనంగా ముగిసిన అగ్నిమాపక సేవా వారోత్సవాలు.
'సురక్షిత పాఠశాల - సురక్షిత ఆసుపత్రి' థీమ్ తో అవగాహన కార్యక్రమాలు.
1,600 మందికి పైగా అగ్ని భద్రతపై ప్రత్యక్ష శిక్షణ ఇచ్చిన హెచ్‌ఎస్‌ఎల్ (HSL).
ఆర్కే బీచ్ ప్రదర్శనపై రాష్ట్ర హోం మంత్రి ప్రశంసలు.
 భద్రత అనేది నిత్య క్రమశిక్షణ: డైరెక్టర్ కమాండర్ రాకేష్
 ప్రసాద్.



విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ (HSL) ఆధ్వర్యంలో గత వారం రోజులుగా నిర్వహిస్తున్న అగ్నిమాపక సేవా వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఏప్రిల్ 14న ప్రారంభమైన ఈ వేడుకలు, నిన్నటితో ముగింపు దశకు చేరుకున్నాయి.



"సురక్షిత పాఠశాల.. సురక్షిత ఆసుపత్రి" అనే నినాదంతో సాగిన ఈ కార్యక్రమంలో.. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించారు. సంస్థ సీఎండీ కెప్టెన్ గంటి వెంకటేశ్వర్లు గారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ భద్రతా నియమాలను పాటించాలని, అగ్నిమాపక సిబ్బంది సేవలు వెలకట్టలేనివని కొనియాడారు.



దాదాపు 1,600 మందికి పైగా విద్యార్థులు, సిబ్బందికి ప్రత్యక్ష ప్రదర్శనల ద్వారా శిక్షణ ఇచ్చారు.



ఆర్కే బీచ్ వద్ద హెచ్‌ఎస్‌ఎల్ నిర్వహించిన భారీ అగ్నిమాపక ప్రదర్శన రాష్ట్ర హోం మంత్రి ప్రశంసలు అందుకోవడం విశేషం.



అవగాహన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసిన డైరెక్టర్ కమాండర్ రాకేష్ ప్రసాద్.



అగ్ని భద్రత అనేది కేవలం ఒక వారం పాటించేది కాదని.. అది నిత్యం పాటించాల్సిన క్రమశిక్షణ అని అధికారులు స్పష్టం చేశారు. సమాజ భాగస్వామ్యంతోనే ప్రమాద రహిత విశాఖను నిర్మించవచ్చని హెచ్‌ఎస్‌ఎల్ పిలుపునిచ్చింది.