తిరుమల పవిత్రతను కాపాడాలంటూ వైయస్సార్ సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ



విశాఖపట్నం (తూర్పు నియోజకవర్గం): పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, తిరుమల పవిత్రతను కాపాడే దిశగా, బి.ఆర్. నాయుడుని వెంటనే ఛైర్మన్ పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో విశాఖ తూర్పు నియోజకవర్గం కార్యాలయం పక్కన ఉన్న, శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వరస్వామి వారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. 



ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వార్డు పరిశీలకులు, జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, వార్డు అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, ఇతర నాయకులు తో కలసి పాల్గొన్న వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి.