హైదరాబాద్ : బహదూర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో 9 నెలల గర్భవతిగా ఉన్న మాదిగ యువతిని మోసం చేసిన యువకుడిపై కేసు నమోదు చేయాలని కోరుతూ వెళ్లిన జర్నలిస్టులు నగేష్, సంతోష్, రాకేష్‌లతో పోలీసులు దురుసుగా ప్రవర్తించిన ఘటనను డిజిటల్ మీడియా జర్నలిస్టు యూనియన్ (DMJU) తీవ్రంగా ఖండిస్తోంది.
బాధితురాలికి న్యాయం చేయాలని అడిగినందుకు జర్నలిస్టులతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా, జర్నలిస్టు రాకేష్‌ను బలవంతంగా పోలీస్ స్టేషన్ నుండి బయటకు గెంటివేయడం అత్యంత అనాగరిక చర్య. ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉన్న పోలీస్ వ్యవస్థ ఇలాంటి ప్రవర్తన చేయడం తీవ్రంగా ఖండించదగిన విషయం. ఇప్పటికే రెండు మూడు రోజుల్లో డెలివరీ అయ్యే పరిస్థితిలో ఉన్న ఆ మాదిగ యువతి తన భర్త ఆచూకీ కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతుండటం బాధాకరం. ఇంత క్లిష్ట పరిస్థితిలో ఉన్న మహిళకు న్యాయం చేయకుండా కేసు నమోదు చేయడంలో ఆలస్యం చేయడం అనుమానాలకు తావిస్తోంది.ఈ పరిస్థితుల్లో ఆ మహిళ పోలీస్ స్టేషన్ వద్దే డెలివరీ అయ్యే పరిస్థితి వస్తుందేమో అన్న భయం కలుగుతోంది.జర్నలిస్టులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని, జర్నలిస్టులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని DMJU డిమాండ్ చేస్తోంది. అలాగే బాధిత మహిళకు తక్షణ న్యాయం చేసి, సంబంధిత యువకుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.
డిజిటల్ మీడియా జర్నలిస్ట్ యూనియన్ (DMJU)
ఎంపల్లి ముతేష్, గౌరవ అధ్యక్షులు, 94903 78295
కే రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షులు
బొడ్డు అశోక్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.


