వైసీపీని క్షేత్రస్థాయి భలోపేతం చేద్దాం



విశాఖపట్నం (తూర్పు నియోజకవర్గం): వైసీపీని క్షేత్రస్థాయి భలోపేతం చేద్దాం అని వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖపట్నం మహిళా విభాగం అధ్యక్షురాలు మరియు విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం పరిశీలకులు పేడాడ రమణికుమారి  తెలిపారు. 



ఈ రోజు సీతమ్మధార విశాఖ తూర్పు నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో తూర్పు నియోజకవర్గం సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో విశాఖ తూర్పు నియోజకవర్గం సమావేశం నిర్వహించారు. 



ఈ సమావేశంలో రమణికుమారి మాట్లాడుతూ వార్డు & సచివాలయం పార్టీ కమిటీలు త్వరగతిన పూర్తిచేసి, వార్డు సచివాలయం స్థాయిలో ప్రతి ఒక్కరూ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, వార్డు పరిశీలకులు, జిల్లా కమిటీ సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గం, వార్డు అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.