జర్నలిజం పరిమితులు ప్రజాస్వామ్యానికి రక్షణ కవచాలు.

జర్నలిజం అనేది కేవలం వార్తలను ప్రచురించే వృత్తి మాత్రమే కాదు. అది ప్రజాస్వామ్యానికి దిశానిర్దేశం చేసే బాధ్యతాయుతమైన వ్యవస్థ. అందుకే పత్రికా రచనలకు కొన్ని నైతిక,చట్టబద్ధ పరిమితులు అవసరం. దేశ భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు భంగం కలిగించే అంశాలను ప్రచారం చేయకూడదనే బాధ్యత ప్రతి జర్నలిస్టుపై ఉంటుంది. విదేశీ..,దేశాలతో భారతదేశానికి ఉన్న సంబంధాలను దెబ్బతీసే విధంగా వార్తలు, వ్యాఖ్యలు ఉండకూడదు.సమాజంలో అశాంతిని, విద్వేషాన్ని రెచ్చగొట్టే రచనలు కూడా జర్నలిజం ధర్మానికి చాలా విరుద్ధం.అలాగే అశ్లీలతను ప్రోత్సహించే కథనాలు, ఉద్రేకాలను రెచ్చగొట్టే ప్రచారాలు బాధ్యతాయుత మైన పత్రికారంగానికి ఏ మాత్రం తగవు.కోర్టులపై నిరాధార విమర్శలు చేయడం, న్యాయస్థాన తీర్పులను అవమానించే రీతిలో వ్యాఖ్యానించ డం కూడా సరైన పత్రికా ధోరణి కాదు.



ప్రజాస్వామ్య వ్యవస్థలో న్యాయ వ్యవస్థకు ఉన్న గౌరవాన్ని జర్నలిస్టు లు కాపాడాల్సిన బాధ్యత ఉంది.నేరాలను ప్రోత్సహించేలా, నేరచరిత్ర కలిగిన వ్యక్తుల ప్రచారానికి వేదికగా మారేలా వార్తలు ప్రచురించాలా..., వద్దా...? అన్న విషయాన్ని విలేకరి నుండి సబ్ ఎడిటర్ వరకు ప్రతీ ఒక్కరూ పరిశీలించాలి.ఒక సమా చారం అందిందంటే దానిని యథా తథంగా ప్రచురించడం జర్నలిజం కాదు.ఆ సమాచారంలో నిజమెంత, అసత్యమెంత అన్నది ధృవీకరించ డం పత్రిక బాధ్యత. ప్రస్తుతం కొన్ని మీడియా సంస్థలు ఎలాంటి పరిశీలన లేకుండా వచ్చిన సమాచారాన్ని ప్రచు రించడం ఆందోళన కలిగించే విషయం.ఇది జర్నలిజం ప్రమాణా లనే ప్రశ్నించే పరిస్థితినితీసుకొస్తోంది.

జర్నలిస్టు పాత్రలో అత్యుత్సాహం కంటే వాస్తవాన్ని వాస్తవంగానే చూపించడం ముఖ్యమైనది. అసంపూర్ణ సమాచారం ఆధారంగా కథనాలు నిర్మించడం కంటే నిజానిజాలు నిర్ధారించుకోవడం అవసరం.ప్రయత్నించినా పూర్తి ఆధారాలు లభించని సందర్భాల్లో నిరూపించలేని అంశాలను వదిలే యడం కూడా బాధ్యతాయుతమైన జర్నలిజమే.ఎందుకంటే ప్రతి నిజం ప్రజా ప్రయోజనానికి ఉపయోగపడు తుందా లేదా..,అన్నది కూడా అంచ నా వేయాల్సిందే.వ్యాఖ్యలు చేసే సమయంలో కూడా సమంజసమైన కారణాలు, ఆధారాలు ఉండాలి. వాస్తవాలపై నిలబడని వ్యాఖ్యలు బాధ్యతాయుత రచనగా పరిగణించ బడవు.విషపూరిత ప్రచారం,నిరూ పించలేని ఆరోపణలు చట్టవిరుద్ధమే కాకుండా జర్నలిస్టు వృత్తి ధర్మానికీ విరుద్ధం.నిజం ఆధారంగా చేసే విశ్లేషణ,ప్రజా ప్రయోజనాన్ని కాపాడే వ్యాఖ్య, కోర్టులు,పార్లమెంట్, అసెంబ్లీ లేదా ప్రజాసభల నివేదికలపై సమగ్ర సమీక్షలే నిజమైన పత్రికా రచ నలకు ఉదాహరణలు.జర్నలిజం బ్రత కాలి అంటే పత్రికా పరిమితులను గౌరవించే సంస్కృతి అవసరం.నిజా న్ని నిర్భయంగా చెప్పే స్వేచ్ఛ ఎంత ముఖ్యమో, ఆ నిజం సమాజానికి మేలు చేసేలా ఉండటం అంతకంటే ముఖ్యమని ప్రతి జర్నలిస్టు గుర్తిం చాలి.కలం ప్రజల విశ్వాసాన్ని నిల బెట్టే దిశగా నడవాలి గానీ,అడ్డదా రులు వెతికే సాధనంగా మారకూడదు.