​జన్మదినం సందర్భంగా సీఎం ఆశీస్సులు తీసుకున్న మైనారిటీ నేత

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసిన ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షిబ్లీ



​అమరావతి: మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు, ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్ ఫరూఖ్ షిబ్లీ తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు, స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాత మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కి పుష్పగుచ్ఛం అందజేసి, వారి పవిత్ర ఆశీస్సులు తీసుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు ఫరూఖ్ షిబ్లీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆశీర్వదించారు.

​ఈ సందర్భంగా ఫరూఖ్ షిబ్లీ మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. దేశ రాజకీయాల్లోనే అత్యంత దూరదృష్టి గల నేత, అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అయిన చంద్రబాబు నాయుడు గారిని కలవడం తనకెంతో గర్వకారణంగా ఉందన్నారు.

​"నాకు ఎటువంటి రాజకీయ కుటుంబ నేపథ్యం లేకపోయినా, కేవలం ఒక సాధారణ పౌరునిగా సమాజ శ్రేయస్సు కోసం నేను పడుతున్న శ్రమను, బాధ్యతగా చేపడుతున్న కార్యక్రమాలను గుర్తించి నాకు రాజకీయ అవకాశాన్ని కల్పించిన మహోన్నత నేత మన ముఖ్యమంత్రి. ఆయనే నా రోల్ మోడల్."– ఫరూఖ్ షిబ్లీ, ఏపీ స్టేట్ ఉర్దూ అకాడమీ చైర్మన్. 

​తనకు రాజకీయ భిక్ష పెట్టిన ముఖ్యమంత్రి చల్లని దీవెనలు ఎల్లవేళలా తనపై ఇలాగే ఉండాలని ఆయన ఆకాంక్షించారు. రాజకీయంగా తాను వేసే ప్రతి అడుగులో ఒక గురువుగా చంద్రబాబు నాయుడు గారు తనకు సన్మార్గం చూపిస్తూ, నడిపిస్తారని ఆశిస్తున్నట్లు ఫరూఖ్ షిబ్లీ ఈ సందర్భంగా పేర్కొన్నారు. మైనారిటీల సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం ఆశయాలకు అనుగుణంగా నిరంతరం శ్రమిస్తానని ఆయన పునరుద్ఘాటించారు.