విశాఖలో ఐ.సీ.ఎం.ఆర్ బృందం పర్యటన

విశాఖలో ఐ.సీ.ఎం.ఆర్ బృందం పర్యటన: వేసవి హీట్ వేవ్ కార్యాచరణపై సమీక్ష



విశాఖపట్నం, అక్టోబర్ 24: భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) న్యూఢిల్లీ, చెన్నై విభాగాలకు చెందిన ఉన్నత స్థాయి పరిశోధక బృందం శనివారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించింది. ఈ సందర్భంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి (DM&HO) డాక్టర్ పి. జగదీశ్వర రావు, జిల్లా ఎపిడమాలజిస్ట్ డాక్టర్ ప్రదీప్ రాజా తదితరులను ఐసీఎంఆర్ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది.



2026 వేసవి కాలంలో జిల్లాలో ఎండ తీవ్రత, వడదెబ్బ (హీట్ స్ట్రోక్) నివారణకు ఆరోగ్య శాఖ చేపట్టిన ముందస్తు ప్రణాళికలు (యాక్షన్ ప్లాన్), తీసుకున్న రక్షణ చర్యల వివరాలను బృందం సభ్యులు అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లాకు సంబంధించిన 2026 హీట్ క్యాలెండర్‌పై అధికారులతో ప్రత్యేకంగా చర్చించారు.

ఈ పరిశోధక బృందంలో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్టులు డాక్టర్ వైదేశ్ గోస్వామి, డాక్టర్ విజ్జేశ్వరన్.కె, డాక్టర్ ప్రియాంతి.ఎ, శ్రీ విజ్జేశ్ బాబు తదితరులు ఉన్నారు.

ఈ సమావేశంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జగదీశ్ ప్రసాద్, జిల్లా ఎపిడమాలజిస్ట్ డాక్టర్ శాంతి సౌందర్య, అసిస్టెంట్ మలేరియా అధికారి శ్రీ బి. నాగభూషణ రావు మరియు జిల్లా ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు.