సోషల్ మీడియా కార్యకర్తలకు న్యాయం చేస్తాం: సజ్జల రామకృష్ణారెడ్డి

సజ్జలను మర్యాదపూర్వకంగా కలిసిన మావిగన్ సోషల్ మీడియా టీవీ చైర్మన్ సుధాకర్ రెడ్డి

సోషల్ మీడియా మిత్రుల సమస్యలపై సుదీర్ఘ చర్చ



విజయవాడ, నవంబర్ 12: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం సోషల్ మీడియా వేదికగా నిరంతరం పనిచేస్తున్న కార్యకర్తల సమస్యలను పరిష్కరించి, వారందరికీ తగిన గుర్తింపు, న్యాయం కల్పిస్తామని వైఎస్సార్‌సీపీ ముఖ్య నేత సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చినట్లు మావిగన్ సోషల్ మీడియా టీవీ చైర్మన్ సుధాకర్ రెడ్డి తెలిపారు. గురువారం విజయవాడలో సజ్జల రామకృష్ణారెడ్డిని సుధాకర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న సోషల్ మీడియా మిత్రులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ప్రస్తుత పరిస్థితులను ఆయన సజ్జల దృష్టికి తీసుకెళ్లారు. క్షేత్రస్థాయిలో పార్టీ గళాన్ని వినిపిస్తున్న సోషల్ మీడియా కార్యకర్తలకు అండగా నిలవాలని కోరారు. దీనిపై సజ్జల రామకృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించారని సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు. పార్టీ సోషల్ మీడియా విభాగంలో పనిచేస్తున్న వారందరినీ ఒకే వేదికపైకి తీసుకురావాలని, వారి సమస్యలను పరిష్కరించేందుకు పార్టీ తరపున కచ్చితమైన చర్యలు తీసుకుంటామని సజ్జల భరోసా ఇచ్చినట్లు ఆయన వెల్లడించారు. సోషల్ మీడియా కార్యకర్తల సేవలను గుర్తించి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడం పట్ల సుధాకర్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.