దీపావళి సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన నివాసంలో మెగా పార్టీ ఇచ్చాడు. ఈ వేడుకల్లో చిరంజీవి తదితర మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు, వెంకటేశ్, నాగార్జున, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, మంచు లక్ష్మి... ఇలా చాలామంది తారలు పాల్గొన్నారు.
చిరంజీవి యంగ్ జనరేషన్ కు ఏమాత్రం తగ్గకుండా ఫుల్ జోష్ తో డ్యాన్స్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. రాజకుమారితో కలిసి చిరు హుషారుగా డ్యాన్స్ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.