లోక్ అదాలత్ లో 1,22,146 కేసుల పరిష్కారం: డీజీపీ కేవీ రాజేంద్ర నాథ్ రెడ్డి.
మంగళగిరి: రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 10వ తేదీన జరిగిన లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారమైనట్లు ఏపీ డీజీపీ కేవీ రాజేంద్ర నాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 386 ప్రత్యేక బెంచ్ ల ద్వారా జరిగిన లోక్ అదాలత్ లో పోలీస్ శాఖకు సంబంధించి మొత్తం 1,22,146 కేసులను పరిష్కరించడం జరిగినట్లు తెలిపారు. 19,150(UnderInvestigation cases-7,970. PendingTrail cases-11, 180) కంపౌండబుల్ IPC కేసులు (భూమి, ఆస్తి, హక్కులపై వివాదాలు,చిన్న నష్టాలు, గాయాలు, చిన్న దొంగతనాలు, దోపిడీలు, సాదారణ స్థాయిలో హింస) వంటి కేసులు కాగా ఐపిసి కాని ఇతర కేసులు మరియు 1,02,996 పెట్టీ కేసులను లోక్ అదాలత్ ద్వారా పరిష్కరించడం జరిగినట్లు తెలిపారు. లోక్ అదాలత్ లో పెద్ద ఎత్తున కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ద చూపిన ఎన్‌టిఆర్ జిల్లా, నెల్లూరు జిల్లా,శ్రీకాకుళం జిల్లా ,విశాఖపట్నం జిల్లా, కడప జిల్లా, చిత్తూరు జిల్లా ఎస్పీలను, సిబ్బందిని డీజీపీ అభినందించారు.