సమాచార మంత్రి కోలుసు పార్థసారథి తో భేటీ అయిన జయ్ యూనియన్ జర్నలిస్టులు

సమాచార మంత్రిత్వ శాఖ మంత్రిని కలసిన జయ్ యూనియన్ జర్నలిస్టులు

సమాచార మంత్రి కోలుసు పార్థసారథి తో భేటీ అయిన రాష్ట్ర స్థాయిలో ఉన్న జయ్ యూనియన్ జర్నలిస్టులు

ప్రసార సమాచార శాఖ మంత్రి ని కలసి యూట్యూబ్ జర్నలిస్టుల సమస్యలను తెలిపిన జయ్ యూనియన్ జర్నలిస్టులు



మంగళగిరి, జనవరి 6: యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్ట్ ల సంక్షేమం, హక్కుల పరిరక్షణకై ఆంధ్రా రాష్ట్రం లో రిజిస్టర్డ్ చేసుకుని, ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ జర్నలిస్టుల ఏకైక సంఘం *జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ యూట్యూబర్స్ జయ్ యూనియన్*. సభ్యులు వివిధ జిల్లాల నుంచి విచ్చేసి మంగళగిరి టీడీపీ రాష్ట్ర కార్యాలయమ వద్ద సమాచార మంత్రిత్వ శాఖ మంత్రి కోలుసు పార్థసారథి ను కలిశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యూట్యూబ్ న్యూస్ చానెల్స్ నిర్వాహకులు, వివిధ ప్రాంతాల్లో ఉన్న యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను జయ్ యూనియన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి సంజయ్ రెడ్డి తెలియజేస్తూ రాజ్యాంగం చట్టబద్ధంగా జర్నలిస్టులకు కల్పించే ప్రతి సంక్షేమం జయ్ యూనియన్ నందు ఉన్న జర్నలిస్టులకు అందించాలని వినతి పత్రం అందజేశారు. శ్రీ సత్యసాయి జిల్లా, కడప, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణ, ఉమ్మడి గోదావరి జిల్లాలు, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచి విచేసిన యూట్యూబ్ న్యూస్ చానెల్స్ నిర్వాహకులు మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు మా యూట్యూబ్ న్యూస్ చానెల్స్ కీలక పాత్ర పోషించాయని, ప్రజా సమస్యలను వెలికితీస్తూ, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు తెలియజేయటం లో, నిరంతరం వార్త సేకరణ చేస్తూ, సాటిలైట్ ఛానెల్స్ తో పోటీపడుతూ మా డిజిటల్ మీడియా వేదిక ద్వారా క్షణాల వ్యవధిలో ప్రసారాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.



యువగలం పాదయాత్రలో భాగంగా మానవనరులు, విద్యా, ఐటీ, ఆర్టీజి శాఖ మంత్రి నారా లోకేష్ ప్రజల వద్దకు వచ్చినపుడు యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమం కల్పిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఇప్పటికి మా సమస్యలను పరిష్కారం చూపలేదని రాష్ట్ర వ్యాప్తంగా జయ్ యూనియన్ యొక్క యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులం మంత్రి నారా లోకేష్ కు కలసి మా సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపించాలని తెలియజేయడానికి విచేసామని మంత్రి పార్థసారథి కి తెలిపారు.



ఈ సందర్భంగా మంత్రి పార్థసారథి మాట్లాడుతూ..జయ్ యూనియన్ లో ఉన్న జర్నలిస్టులకు ప్రతి ప్రెస్ మీట్ నందు ప్రవేశం కలిగేలా ఐ&పి.ఆర్ కమిషనర్ కు ఆదేశాలు ఇస్తామని, ప్రతి జిల్లాయంధు ఉన్న డి.పి.ఆర్.ఓ. లకు తెలియజేస్తామని తెలిపారు. ఇప్పటి వరకు అక్రెడిటేషన్ విషయంలో కమిటీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేదని, యూట్యూబ్ న్యూస్ ఛానెల్స్ నిర్వహిస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వ సంక్షేమం అందించే దిశగా మంత్రి నారా లోకేష్ అడుగులు వేస్తున్నారని, అందువలనే అక్రెడిటేషన్ విషయంలో జాప్యం జరుగుతుందని, తప్పక రానున్న రోజులలో జయ్ యూనియన్ జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కమిటీలో నియమిస్తామని, ప్రభుత్వం ద్వారా యూనియన్ కు తగిన గుర్తింపు, సంక్షేమం కల్పిస్తామని తెలిపారు. 



ఈ కార్యక్రమంలో జయ్ యూనియన్ అధ్యక్షులు సుధాకర్, ఉపాధ్యకులు మహేష్, అంజలి, సహాయక కార్యదర్శి శంకర్, హృదయ్నాథ్ తో పాటుగా జిల్లాల వారీగా అధ్యక్షులు, కార్యదర్శులు, మరియు సీనియర్ పాత్రికేయులు పాల్గొన్నారు.