పరీక్షల ఒత్తిడి పై గోపాలపట్నం బాలుర పాఠశాల పదో తరగతి విద్యార్థులకు అవగాహన
గోపాలపట్నం: మనసులోని ఆందోళనను పంచుకునే తోడు కోసం విద్యార్థులు ఆరాటపడుతున్నారు. ముఖ్యంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ సమయంలో తీవ్ర ఒత్తిడికి గురవుతున్నట్టు చాలా అధ్యయనాలు వెల్లడించాయని విశాఖపట్నం జిల్లా మానసిక ఆరోగ్య ప్రోగ్రామ్ మానసిక ఆరోగ్య నిపుణులు డా. బి. నిత్యా ఐశ్వర్య(సైకియాట్రీ), క్లినికల్ సైకాలజిస్ట్ జి. సాయి లక్ష్మీ తెలిపారు.
శుక్రవారం గోపాలపట్నం జిల్లా పరిషత్ ప్రాథమిక ఉన్నత పాఠశాల(బాలురు)లో పరీక్షల ఒత్తిడి పై పదో తరగతి విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు వారి బంగారు భవిష్యత్ కోసం ఆందోళన, పెర్ఫార్మెన్స్ టార్గెట్స్, టీనేజ్ కన్ఫ్యూషన్స్, తల్లిదండ్రుల అంచనాల నిజం చేయడం, ఇతరులతో పోలికలు, పరీక్షల ఒత్తిళ్లు, స్కూల్లో పీర్ బుల్లింగ్ వంటి అనేక సమస్యలతో స్కూల్ విద్యార్థులు నలిగిపోతున్నట్లు అభిప్రాయ పడ్డారు. ఏదైనా తమ గుండె లోతుల్లోని బాధను అర్థం చేసుకొని, ఆప్యాయంగా స్వాంత్వన మాటలు చెప్పేవారి కోసం ఎంతోమంది తపనపడుతున్నటు పేర్కొన్నారు.
ఇంట్లో కుటుంబ సభ్యులతో కూడా చెప్పు కోలేని కొన్ని బాధలను ఓర్పుగా విని, మంచి మార్గం చూపేవారికోసం వెతుకుతుంటారాని తెలిపారు. పరీక్షల సమయంలో తగినంత నిద్రా, పౌష్టికాహారం, నీరు తీసుకుంటూ ప్రోమోదరో మెలకువలు ఉపయోగించి చదువు కోవడం వలన పరీక్షల సమయంలో వచ్చే ఒత్తిడిని తగ్గించుకోవచ్చన్నారు. అలానే బాక్స్ బ్రీతింగ్, మెడిటేషన్, యోగా వాటి ప్రాక్టీసెస్ కూడా ఒత్తిడి నివారణకు ఉపయోగపడుతుంది అన్నారు. మానసిక ఒత్తిడికి గురైనప్పుడు 14416 అనే టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ కి సంప్రదించవలసిందిగా కోరారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయులు వై.వి.ఎస్ వేణుగోపాల్ మాట్లాడుతూ మానసిక ఆరోగ్యం ప్రతీ ఒక్కరికీ అవసరం, ముఖ్యంగా విద్యార్థులు కష్టంగా కాకుండా, ఇష్టంగా ప్రణాళిక ప్రకారం చదువు కోగలిగితే ఒత్తిడిని జయించి, మంచి ఫలితాలు సాధిస్తారని తెలిపారు. అలానే మన పాఠశాల స్థాయిలో ఎవరికైనా పరీక్షలపై భయంగానీ, ఆందోళనగానీ, తీవ్రమైన విచారం కలిగినట్లయితే వెంటనే డిస్ట్రిక్ట్ కెరీర్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్ బి. శ్రీధర్ ని సంప్రదించాలన్నారు. కౌన్సిలర్ మాట్లాడుతూ మానసిక ఆందోళనతో తమను సంప్రదించే వారి వివరాలు అత్యంత గోప్యంగా ఉంచుతున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.




