డోర్ టు డోర్ ‘సంక్షేమం–అభివృద్ధి.. టీడీపీ పసుపు జెండా’ కార్యక్రమం
రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప
ఆదోని, ఆగస్టు 10: తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘సంక్షేమం–అభివృద్ధి.. టీడీపీ పసుపు జెండా’ డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గంలో రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప బూత్ కన్వీనర్లు, క్లస్టర్ ఇన్‌చార్జిలు, పార్టీ కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు ప్రజలు రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని మాన్వి దేవేంద్రప్ప తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వల్ల తమ కుటుంబాలకు ఎంతో ప్రయోజనం కలుగుతోందని పలువురు ప్రజలు పేర్కొన్నారని తెలిపారు. ప్రత్యేకంగా మెగా డీఎస్సీ నిర్వహణపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్‌కు ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతున్నారని చెప్పారు. తమ కుటుంబంలో ఒకరికి ఉపాధ్యాయ ఉద్యోగం లభించడంతో కుటుంబం మొత్తం సంతోషంగా ఉందని, అందుకు మంత్రి నారా లోకేష్ కృషే కారణమని పలువురు అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారని తెలిపారు.
అదేవిధంగా తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి సంక్షేమ పథకాలు సకాలంలో అందుతున్నాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని దేవేంద్రప్ప పేర్కొన్నారు. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, కంపెనీలు వస్తుండటంతో యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే ఆశాభావాన్ని ప్రజలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న ఆంధ్రప్రదేశ్.. ప్రస్తుతం అభివృద్ధి, పరిశ్రమలు, ఉద్యోగాల కల్పన దిశగా ముందుకు సాగుతోందన్నారు. ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు సృష్టించాలంటే చంద్రబాబు నాయుడు వంటి దూరదృష్టి కలిగిన నాయకత్వం రాష్ట్రానికి అవసరమని మాన్వి దేవేంద్రప్ప అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి ప్రపంచ పటంలో ప్రత్యేక స్థానం కల్పించాలన్న చంద్రబాబు నాయుడు లక్ష్యాన్ని సాకారం చేసేందుకు ప్రజలు ప్రభుత్వానికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి ఇంటి ముందు పసుపు జెండా ఎగరాలనే లక్ష్యంతో టీడీపీ కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్తున్నారని ఆయన తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగంగా కొనసాగుతాయని మాన్వి దేవేంద్రప్ప ఆశాభావం వ్యక్తం చేశారు



