“మాజీ ఎమ్మెల్యే కొంకా మీనాక్షి నాయుడిని కలిసిన ఆదోని డీఎస్పీ”

ఆదోని మాజీ ఎమ్మెల్యే కొంకా మీనాక్షి నాయుడిని మర్యాదపూర్వకంగా కలిసిన డీఎస్పీ



ఆదోని: ఆదోని నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కొంకా మీనాక్షి నాయుడును ఆదోని డీఎస్పీ జి. వెంకటరమణ మర్యాదపూర్వకంగా కలిశారు.



మాజీ ఎమ్మెల్యే కొంకా మీనాక్షి నాయుడు స్వగృహంలో జరిగిన ఈ భేటీలో డీఎస్పీ వెంకటరమణ ఆయనను శాలువాతో సత్కరించారు. అనంతరం కొంకా మీనాక్షి నాయుడు కుటుంబ సభ్యుడు కొంకా ఉమాపతి నాయుడును కూడా డీఎస్పీ పలకరించారు.



ఈ సందర్భంగా పరస్పరం ఆత్మీయంగా మాట్లాడుకుని, స్థానిక పరిస్థితులు తదితర అంశాలపై మర్యాదపూర్వకంగా చర్చించినట్లు సమాచారం.