సంతేకుడ్లూరులో ఎల్‌ఎల్‌సీ కాలువ కబ్జాను అడ్డుకోవాలి

సంతేకుడ్లూరులో ఎల్‌ఎల్‌సీ కాలువ కబ్జాను అడ్డుకోవాలి

అధికారులకు నూర్ అహ్మద్ ఫిర్యాదు



ఆదోని | ఆగస్టు 09, 2026: ఆదోని-2 మండల పరిధిలోని సంతేకుడ్లూరు గ్రామంలో ప్రవహిస్తున్న ఎల్‌ఎల్‌సీ కెనాల్ డీపీ-72 కాలువ కబ్జాను తక్షణమే అడ్డుకోవాలని మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యదర్శి ఎ. నూర్ అహ్మద్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.



సంతేకుడ్లూరు గ్రామంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి నాన్-లే అవుట్ వెంచర్ ఏర్పాటు చేసి, కాలువ గట్టు ప్రాంతంలో ప్లాట్లు వేసి విక్రయానికి ఉంచినట్లు తమ దృష్టికి వచ్చిందని నూర్ అహ్మద్ తెలిపారు. కాలువ కబ్జాను వెంటనే అడ్డుకోకపోతే భవిష్యత్తులో కాలువకు నష్టం వాటిల్లి, వేలాది మంది రైతులకు సాగునీటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించని వీఆర్‌ఓపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అధికారులు తక్షణమే స్పందించి ఎల్‌ఎల్‌సీ కాలువను పరిరక్షించడంతో పాటు, అక్రమ వెంచర్‌పై చర్యలు తీసుకోవాలని నూర్ అహ్మద్ కోరారు. సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమైతే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని ఆయన హెచ్చరించారు.

– ఎ. నూర్ అహ్మద్

రాష్ట్ర కార్యదర్శి

మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి