రాయగడ–గుంటూరు రైళ్ల రాకపోకల్లో మార్పులు

 రాయగడ–గుంటూరు రైళ్ల రాకపోకల్లో మార్పులు

విజయనగరం వద్దే రైలు 17243 షార్ట్ టెర్మినేషన్‌



విజయనగరం: ట్రాఫిక్‌-కమ్‌-పవర్‌ బ్లాక్‌ కారణంగా గుంటూరు–రాయగడ రైలు నంబర్‌ 17243 రాకపోకల్లో మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ రైలు ఆగస్టు 12న గుంటూరు నుంచి బయలుదేరి రాయగడకు వెళ్లాల్సి ఉండగా, విజయనగరం వరకే నడిపి అక్కడే ముగించనున్నారు. గరుడబిల్లి–గోట్లం మధ్య ఆగస్టు 13న చేపట్టనున్న ట్రాఫిక్‌-కమ్‌-పవర్‌ బ్లాక్‌ నేపథ్యంలో ఈ మార్పు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.



రైలు 17244 రాకపోకల్లోనూ మార్పు



రాయగడ–గుంటూరు రైలు నంబర్‌ 17244ను కూడా ఆగస్టు 13న రాయగడ నుంచి కాకుండా విజయనగరం నుంచి గుంటూరుకు బయలుదేరేలా మార్పు చేశారు. గరుడబిల్లి–గోట్లం మధ్య చేపట్టనున్న ట్రాఫిక్‌-కమ్‌-పవర్‌ బ్లాక్‌ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.



ఈ మార్పుల వల్ల ప్రయాణికులకు కలిగే అసౌకర్యానికి రైల్వే అధికారులు విచారం వ్యక్తం చేశారు.