సుల్తానాపురంలో ఇంటింటికీ తెలుగుదేశం

సుల్తానాపురంలో ఇంటింటికీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించిన టీడీపీ నాయకులు



ఆదోని: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఆదోని నియోజకవర్గంలో నిర్వహిస్తున్న “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమంలో భాగంగా సుల్తానాపురం గ్రామంలో టీడీపీ నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలిశారు. ఆదోని నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే కొంక మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు కొంక ఉమాపతి నాయుడు పాల్గొన్నారు.



ఈ సందర్భంగా ఉమాపతి నాయుడు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజల ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.



ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ పేదలు, మహిళలు, రైతులు, యువత, వృద్ధులు, కార్మికులు సహా అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. పింఛన్ల పెంపు, ఉచిత ఇసుక, అన్న క్యాంటీన్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దీపం పథకం, మెగా డీఎస్సీ, ఉద్యోగ అవకాశాలు వంటి పలు కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తోందని పేర్కొన్నారు.



ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కారానికి కృషి చేయడమే “ఇంటింటికీ తెలుగుదేశం” కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని ఉమాపతి నాయుడు తెలిపారు.



ఆదోని నియోజకవర్గ అభివృద్ధి కోసం కొంక మీనాక్షి నాయుడు నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, ప్రజా సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన అన్నారు. ప్రజల ఆశీస్సులు, సహకారంతో కూటమి ప్రభుత్వం మరింత అభివృద్ధి దిశగా ముందుకు సాగుతుందని తెలిపారు.



ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జిందే శంకర్, రామస్వామి, రంగన్న, తిరుమల, నరసింహులు, శ్రీరాములు, మహేష్, మద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.