ఆంద్రప్రదేశ్ లో నేడు లా నేస్తం నిధులు విడుదల
2023–24 సంవత్సరానికి సంబంధించి రెండోవిడత వైఎస్సార్ లా నేస్తం నిధులను సీఎం వైఎస్ జగన్ నేడు తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్ బటన్ నొక్కి విడుదల చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2,807 మంది జూనియర్ న్యాయవాదులు ఈ పథకానికి అర్హులు. వీరందరికి నెలకు రూ.5,000 స్టైఫండ్ చొప్పున 2023 జూలై నుంచి డిసెంబర్ వరకు(ఆరునెలలు) ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.30 వేలు జమచేయనున్నారు.