కార్తీక మాసం చివరి సోమవారం రోజున బస్సులలో "మహాలక్ష్మి" ల రద్దీ
మహాలక్ష్మి పథకం కింద తెలంగాణలో మహిళలు, బాలికలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తున్నారు. ఈనెల 9 నుంచి ఈ పథకం అమల్లోకి వచ్చింది. దీంతో చాలా మంది మహిళలలు బస్సుల్లో ప్రయాణిం చేందుకు ఆసక్తి చూపు తున్నారు. తద్వారా ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరుగుతోంది. గత ఆదివారం డిసెంబర్ 3తో పోలిస్తే ఈ ఆదివారం డిసెంబర్ 10 దాదాపు 15 శాతం పెరిగినట్లు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. బస్సు ప్రయాణికుల్లో ఎక్కువ మంది మహిళలే ఉన్నారని తెలిపారు. టిమ్స్‌లో 'జీరో టికెట్' సాఫ్ట్‌వేర్ అందుబాటులోకి వచ్చాక వాస్తవ సంఖ్యపై స్పష్టత వస్తుందని అన్నారు. మిగతా రోజులతో పోలిస్తే సాధారణంగా సోమవారం ప్రయాణికుల రద్దీ ఎక్కు వగా ఉంటుంది. అందు లోనూ ఇవాళ కార్తికమా సంలో ఆఖరి సోమవారం కావడంతో మహిళా ప్రయాణికుల రద్దీ భారీగా ఉండవచ్చని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రైవర్లు, కండక్టర్లకు సెలవులను రద్దు చేశారు. సిబ్బందికి సెలవులు లేవని..విధులకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పారు. ఇక వేములవాడ, కాళేశ్వరం, కీసరగుట్ట, రామప్ప వంటి పుణ్యక్షేత్రాలకు పెద్ద సంఖ్యలో బస్సులు నడిపించాలని ఆర్టీసీ నిర్ణయించింది....