అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం చింతవానిపాలెం ఘాట్ రోడ్డు లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సీతారాం గ్రామానికి చెందిన కుటుంబ సభ్యులతో బాలరేవుల బంధువుల ఇంటికి వచ్చి తిరిగి ప్రయాణమయ్యారు. చింతవానిపాలెం ఘాట్లో బైక్ బ్రేకులు ఫెయిల్ కావడంతో బైక్ లోయలోకి దూసుకెళ్లింది.ఈ ప్రమాదంలో రాంబాబు. అతడి కుమారుడు ప్రశాంత్ అక్కడికక్కడే మృతి చెందారు.