ఈ నెల 27న తెలుగుదేశం పార్టీ కొయ్యూరు మండలం పార్టీ నాయకులు,కార్యకర్తలతో మాజీ ఎమ్మెల్యే పాడేరు నియోజకవర్గం ఇంచార్జ్,గిడ్డి ఈశ్వరి ఆద్వర్యంలో అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నట్లు, కొయ్యూరు మండల పార్టీ ప్రధాన కార్యదర్శి,తోట దొరబాబు ఒక ప్రకటనలో తెలిపారు. 27వ తేదీ గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం అయ్యే ఈ సమావేశానికి, ఈ నెల 27న కొయ్యూరులో పర్యటించనున్న పాడేరు నియోజకవర్గ ఇన్చార్జి గిడ్డి ఈశ్వరి ముఖ్యఅతిథిగా పాల్గొన్నందున మండల పరిధిలో అన్ని గ్రామాల నుండి టిడిపి నాయకులు,కార్యకర్తలు,మహిళ లు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని మండల పార్టీ కార్యదర్శి తోట దొరబాబు ఈ సందర్భంగా తెలిపారు.