రెండు బైకులు ఢీ... ముగ్గురికి గాయాలు...

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలంలో రెండు  బైకులు ఢీకొని ముగ్గురికి గాయాలు...



కోమ్మిక పంచాయతీలో ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీకొనే ప్రమాదం చోటు చేసుకుంది. తుమ్మల బంధం, పాత తుమ్మల బంధం, మలుపు వద్ద ఎదురెదురుగా వచ్చి బైకులు ఢీకొన్నాయి. ప్రమాదంలో ముగ్గురికి గాయాలయ్యాయి. ఇందులో ఇద్దరికి తీవ్రంగా గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. క్షత్తగాత్రులను కంటారం PHC కి తరలించారు. ప్రమాదానికి గురైన ముగ్గురిలో ఇద్దరు బోర్రంపేట, ఒకరు పాత తుమ్మల బంధ గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. అయితే మితిమీరను వేగం వల్లే  ఒకరికొకరు బైకులు ఢీకొనడం జరిగిందని స్థానికులు  తెలియపరుస్తున్నారు.