అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం కొత్తవీధి మండలం, కోడిసింగి గ్రామం, పాడేరు నియోజకవర్గంలో బిజెపి ఉపాధ్యక్షులు బోండ్ల చిరంజీవి మాట్లాడుతూ...ఎదారి లేదు...చివరకు గోదారే అన్నట్టు... త్వరలో జగన్ పార్టీ కాంగ్రెస్ లో విలీనం చెయ్యడం ఖాయం. సంచలన వాఖ్యలు చేసిన బీజేపీ యువ నేత బోoడ్ల చిరంజీవి.
అల్లూరి సీతారామరాజు జిల్లా, దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం కాంగ్రెస్ నుండి సిఎం కావాలనుకున్న వైఎస్ జగన్. కోరిక నెరవేక కాంగ్రెస్ నుండి విడి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టి అంధ్రప్రదేశ్ లో 2019 లో ముఖ్యమంత్రిగా అయిదేళ్ళు కొనసాగారు. తన పాలనలో అభివృధ్ధి కన్న అరాచకాలు, సంక్షేమం కన్న దోచుకోవడాలు ఎక్కువ అవ్వడంతో విసుగుచెందిన ఆంధ్ర ప్రదేశ్ ప్రజానీకం జగన్ కి తిరుగులేని దెబ్బ కొట్టడంతో 2024 ఎలక్షన్ పదకొండు స్థానాలకు పరిమితం అయ్యి ప్రతిపక్ష హోదానుకూడ కోల్పోయి ఘోర పరాజయంతో ఓటమి పాలు అయ్యారు. ఇ ఓటమి జగన్ కి జీవిత పాఠాలు నేర్పిస్తుంది అని చిరంజీవి సూచించారు. బీజేపీ నాయకుడు చిరంజీవి విలేఖర్లతో మాట్లాడుతూ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంధ్రప్రదేశ్ లో భూస్థాపితం అవుతుంది. ఎదారి లేకపోతే గోదారె ఇదాలె అన్నట్టు జగన్ మోహన్ రెడ్డి కి చివరకు కాంగ్రెస్ పార్టీ గతి అవుతుంది. ఏదైతే అనాడు కాంగ్రెస్ నుండి విడి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ గా అవతరించారో అదే కాంగ్రెస్ లో తన పార్టీని కలపడం తప్పదు. చిరంజీవి సంచలన వాఖ్యలు చేసారు. వైసీపీగా కొనసాగారు కాని, ఇన్నాళ్లు వారు కాంగ్రెస్లోనే వున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ నుండి వైఎస్ఆర్ తీసేస్తే మిగిలేది కాంగ్రెస్సే ఇప్పుడు అదే పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి కి ఎదురుకాబోతుంది. ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ అక్రమ కేసులు దర్యాప్తు మొదలైతే పార్టీని నడిపే దిక్కుకూడా లేకుండా పోతుంది. వైసీపీ పార్టీ అధ్యక్షురాలు విజయమ్మ దూరంగా వున్నారు. అనాడు అన్నా ఆపదలో ఉన్నప్పుడు అదుకున్న చెల్లి జగన్ తీరుతో విభేదించి కాంగ్రెస్ లో చేరారు. జగన్ జైలుకు వెళితే పార్టీని ఎవరూ నడుపుతారు అని చిరంజీవి ప్రశ్నించారు. కాదనుకున్నపార్టీ కాళ్ళు పట్టుకునే పరిస్థితి జగన్ మోహన్ రెడ్డి కి ఎదురవుతుంది. కాంగ్రెస్ లో కలిపితే కనీసం కప్పుకోవడానికి దుప్పటివున్నట్టు, చెప్పుకోవడానికి షర్మిళ దిక్కుఅవుతారు. అందుకే జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ లో పార్టీని విలీనం చేసి ఆంధ్ర ప్రదేశ్ లో వైసిపిని భూస్థాపితం చేయబోతున్నారు. ఇదిలా వుంటే వాపుని చూసి బలుపు అనుకున్న వైసీపీ నాయకులు వారి పదవీ కాలంలో వాగి, తాగి, తూగి, విర్రవిగారు. జగన్ మోహన్ రెడ్డి తీసుకునే కాంగ్రెస్ లో పార్టీ విలీనం నిర్ణయంతో వైఎస్ఆర్ సీపీ నాయకులందరికీ భవిష్యత్, భూత, వర్తమాన కాలము గుర్తుకువస్తాయి. మిగిలిన పదకొండు మంది వైసీపీ ఎంఎల్ఏలలో అయిదు, ఆరుగురు పార్టీని ఖచ్చితంగా విడి వారికి నచ్చిన పార్టీల్లో చేరేఅవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు ఇటుప్రక్క ఎన్డీయే కూటమి వేటు. తెలంగాణ వెళ్తే రేవంత్ రెడ్డి పోటు భరించలేక ఇవన్ని గ్రహించిన జగన్ వైఎస్ఆర్ సీపీ పార్టీని కాంగ్రెస్ లో కలిపేస్తారు అని చిరంజీవి వ్యాఖ్యానించారు.