ప్రజలంతా వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు సేవల గురించి తెలుసుకోవాలి- ఉపయోగించాలి

ప్రజలంతా వివిధ బ్యాంకింగ్ ఉత్పత్తులు మరియు సేవల గురించి తెలుసుకోవాలి- ఉపయోగించాలి అని దిమిలి ఎస్.బి.ఐ బ్యాంక్ అసిస్టెంట్ మేనేజర్ శ్రీ పి.రవితేజ అన్నారు. 



25వ తేదిన కట్టబోలు గ్రామ సచివాలయం నందు జరిగిన రిజర్వ్ బ్యాంక్ అఫ్ ఇండియా, డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్ వర్క్ షాప్ కు ముఖ్య అతిథి గా పాల్గోని ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బ్యాంకింగ్ సేవల పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండాలి అని అదేవిధంగా నగదు రహిత లావాదేవీలు వినియోగించేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్త పట్ల కూడా అవగాహన కలిగి ఉండాలని మరీ ముఖ్యంగా సైబర్ క్రైమ్స్ గురి కాకుండా ప్రతి ఒక్కరు మరియు సొసైటీ ఫర్ సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ అధ్వర్యములో, ప్రాజెక్టు డైరెక్టర్ వి.ఆంజనేయులు మరియు ప్రాజెక్ట్ మేనేజర్ వి.అశోక్ కుమార్ పర్యవేక్షణ లో నిర్వహించ డమైనది. 

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి ఎ.ఆదిలక్ష్మి, వైస్ సర్పంచి వి.ఎన్. నాయుడు, మాజీ సర్పంచ్ కె .రాము, గ్రామ పెద్ద డి.పి.సన్యాసిరావు, సచివాలయం వ్యవస్థ పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ“ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా బ్యాంకింగ్ ఫోల్డర్‌లో చేర్చబడాలి, ఆర్థిక అక్షరాస్యత కలిగి ఉండాలి, బ్యాంకు ఉత్పత్తులను ఉపయోగించాలి మరియు బ్యాంకింగ్ సేవలను తెలివిగా ఉపయోగించాలి” అని తెలియజేసారు.

ఈ వర్క్ షాప్ లో రిసోర్స్ పర్సన్లు ఎస్. హరి, ఎస్.బాలకృష్ణ, ట్రైనర్లు ఎన్.గణేష్, కె . మణి కుమార్ ఈ క్రింద విషయాలపై అవగాహన కల్పించారు. 

డిపాజిటర్ అభద్రత తొలగింపు, బ్యాంక్ వైపు మొదటి అడుగు, డిపోజిట్ మరియు డిపాజిట్ ఖాతాలు గురుంచి బ్యాంక్ ఖాతా తెరవడం మరియు లావాదేవీలు నిర్వహించడం, డిపాజిట్ ఖాతాలు తో అదనపు ప్రయోజనాలు, పిర్యాదులు పరిష్కార వ్యవస్థ, భారత దేశము లో చెల్లింపు మరియు పరిష్కార వ్యవస్థ గురుంచి వయోవృద్ధులు కు బ్యాంకింగ్ సౌకర్యం, రిజర్వ్ బ్యాంక్ ఇటీవలే కలిపించిన సదుపాయాలు గురుంచి అవగాహన కల్పించారు.