గ్రామ రెవెన్యూ అధికారి మృతి

అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలంలో గ్రామ రెవెన్యూ అధికారి మృతి చెందారు.



 జీకే వీధి మండలం లో గ్రామ రెవెన్యూ అధికారి అనారోగ్యంతో మృతి చెందాడు. వంచుల పంచాయితీ సిరిబాల గ్రామానికి చెందిన చల్లంగి సాల్మన్ రాజు, దేవరపల్లి పంచాయతీ గ్రామ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్నారు. రెండు రోజుల క్రితం తీవ్ర అవస్థకు గురవడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం, విశాఖపట్నం కెజిహెచ్ కు తరలించారు. చికిత్స తీసుకుంటున్న ఆయన బుధవారం తెల్లవారుజామున విశాఖపట్నం కేజీహెచ్ హాస్పిటల్ లో మృతి చెందారు.