ఈరోజు అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్పీ తుహిన్ సిహ్న ఐపిఎస్ వారిని BACK TO BACK NEWS CAHANEL ఉత్తరాంధ్ర ఇంఛార్జి దామోదర గోవింద్, అల్లూరి జిల్లా బ్యూరో సత్తిబాబు మర్యాద పూర్వకంగా కలిసి JAY యూనియన్ లోగో ఎస్పీ చేతుల మీదుగా ఆవిష్కరింప చేశారు. తదుపరి ఎందుకు ఈ JAY యూనియన్ స్థాపించడం జరిగింది, యూనియన్ యొక్క ముఖ్య ఉద్దేస్యం ఎంటి అని ఎస్పీ కి తెలపగ చాలా చక్కటి ఆలోచనల తో యూనియన్ స్థాపించినందుకు శుభాకాంక్షలు తెలిపారు.
అల్లూరి జిల్లాలో JAY యూనియన్ తరుపున ఎంతమంది జర్నలిస్ట్ లు ఉన్నారో వారి అందరితో మాట్లాడుతామని అన్ని విధాల సహాయ సహకారాలు పోలీసుల తరుపున అందిస్తామని ఎస్పీ తెలిపారు. ఈరోజు అంతర్జాతీయ మాదకద్రవ్య వ్యతిరేక దినోత్సవ సందర్భంగా జిల్లాలో యువత ను ఉద్దేశించి మాట్లాడుతూ యువత అతి తక్కువ వయసులోనే మాదక ద్రవ్యాలకు అలవాటు పడి, వారి యొక్క జీవితాన్నీ చేతులారా పోగొట్టుకునే పరిస్థితి ఏర్పడింది అని, వారికి సరైన అవగాహన కల్పించి వారికి సరైనటువంటి మార్గంలో నడిచే ఆలోచనలు సూచనలు అందించమని జిల్లా ఎస్పీని కోరగా ఆయన యువతను ఉద్దేశించి మాట్లాడుతూ పోలీస్ అధికారులు ఎంత హుందాగా నడుచుకుంటారో అదే హుందా తనం తో జర్నలిస్ట్ లు నడుచుకోవాలని ,నిజాన్ని నిర్భయంగా సమాజానికి, ప్రజలకు తెలియజేయాలని వాస్తవాలు ప్రచురించటం వలన నిజం బ్రతికే ఉంది అని తెలిసేలా జర్నలిస్ట్ లు సమాజం లో మెలగాలి అని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో అల్లూరి జిల్లా ఎస్పీ తుహిన్ సిహ్న ఐపిఎస్, బ్యాక్ టూ బ్యాక్ న్యూస్ ఛానెల్ ఉత్తరాంధ్ర ఇన్చార్జి దామోదర గోవింద్, అల్లూరి సీతారామరాజు జిల్లా బ్యూరో సత్తిబాబు పాల్గొన్నారు.