జి ఓ నంబర్ 3 కోసం అరకు లో ఇచ్చిన మాట నిలెట్టుకోవాలి ముఖ్య మంత్రి గారు..
ఆదివాసులకు గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగాలు వచ్చే జి ఓ నెంబర్ 3 సుప్రీం కోర్ట్ లో రద్దు చేసిన నేపద్యంలో గిరిజనులు 100% ఉద్యోగా అవకాశాలు కోల్పోయారు. ఆదివాసి ప్రాంతంలో ఆదివాసీలు ఉద్యోగాలు చేసే అవకాశం లేకుండా పోయింది. ఎలెక్షన్ ప్రచారంలో భాగంగా మీరు అరకు మీటింగ్ లో వేలాది మంది అధివాసుల ముందు జి ఓ నంబర్ 3 పునరుద్దరణ చేస్తానని హామీ ఇచ్చారు. హామీ నిలబెట్టుకోవాల్సిన సమయం వచ్చింది. డీఎస్సీ నోటిఫికేషన్ కు ముందే క్యాబినెట్ సమావేశం ఏర్పరిచి జీవో నెంబర్ 3 కి అనుగుణంగా ఆదివాసి ప్రాంతంలో ఉద్యోగ నియామకల చట్టం తీసుకువచ్చి ఆదివాసులకు 100% ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారని అరకు జిడిపి పార్టీ ఇన్చార్జ్ చుంచు రాజబాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్సీ అభ్యర్థులు, తదితరులు పాల్గొన్నారు.