ముంజేరు దళితుల పోరటానికి లోక్ సత్తా పార్టీ మద్దతు

ముంజేరు దళితుల పోరటానికి లోక్ సత్తా పార్టీ మద్దతు - సందర్శించి మద్దతు ప్రకటించిన లోక్ సత్తా పార్టీ అధ్యక్షులు బిశెట్టి బాబ్జి



విజయనగరం : భోగాపురం మండలం, ముంజేరు దళితులపై జరిగిన దాడిని, దళిత గ్రామాల వైపు మురుగునీరు మళ్ళించాటాన్ని నిరసనగా చేస్తున్న మహిళల రిలే నిరాహార దీక్ష 17వ రోజు చేరుకున్న నేపథ్యంలో నిరసన శిబిరాన్ని లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బిశెట్టి బాబ్జి సందర్శించి మహిళలకు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మార్వో కార్యాలయం వద్ద 17 రోజులుగా మహిళలు రిలే నిరాహారదీక్షలు దీక్ష చేస్తుంటే స్థానిక శాసనసభ్యులు, జిల్లా ఇన్చార్జి మంత్రి గానీ, రాష్ట్ర హోం మంత్రి అనిత మహిళగా కూడా సమస్య నిజాలు తెలుసుకోక పోవటం, వీరీ గోడు వినిపించుకోక పోవటం ఆమె బానిస పదవికి తార్కాణం అని అన్నారు. జిల్లా అధికారులను తమ పార్టీ కలిసి పరిష్కార మార్గం చూపించాలని అడుగుతారని చెప్పారు. నిరసనలో మహిళలను అభినందిస్తూ, బాధితులకు అండగా నిలుస్తానని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా పౌరవేదిక నాయకులు పిడకల ప్రభాకర్, భీంపల్లి భాస్కరరావు పాల్గొన్నారు.