ప్రజల మన్ననలను పొందిన సమాజ సేవకుడు ప్రభాకర్ రావు

బీజేపీ నాయకుడు దుక్కేరి.ప్రభాకరరావు ప్రజా సేవలకుగాను గొడుగుమామిడి గ్రామస్తులు మరియు పాస్టర్స్ దుస్సాలువతో ఘనంగా సన్మానం..



అల్లూరి సీతారామరాజు జిల్లా, గూడెం మండలం,దామనపల్లి పంచాయితీ గొడుగుమామిడి గ్రామంలో ఘనంగా జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకకు హాజరైనా బీజేపీ నాయకుడు దుక్కేరి ప్రభాకరరావును తను జై ఆదివాసీ జై భీమ్ స్వచ్చంద సేవా సంస్థ స్థాపించి ప్రజలు ఏ కష్టమైన ఏ సమయమైనా అనారోగ్యంతో హాస్పిటల్లో ఉన్నామని ఫోన్ చేసిన వెంటనే సంబంధిత హాస్పిటల్ డాక్టర్స్ తో మరియు జిల్లా వైద్యధికార్లతో మాట్లాడి తక్షణమే ఆ సమస్యకు పరిష్కరమార్గం చూపుతూ కుటుంబ సభ్యుడుగా ఆదుకొంటారు, 



అంతేకాకా జిల్లాలో రెవిన్యూ భూమి సమస్యలపై ప్రజల మధ్య తలెత్తిన తగాదాలు పరిష్కరించటం, విద్యార్థిని విద్యార్థుల ఉపాధి కోసం, స్కూల్స్ కాలేజి సమస్యలతో ఉన్న వాళ్లకు తగు సంబదించిన మార్గంలో వాళ్లకు న్యాయం అవకాశాలను కల్పించటం ఉన్నత ఆధికారులతో లేదా జిల్లా కలెక్టర్ లేదా ఐ.టీ.డి.ఏ పి.ఓ తో మాట్లాడి వారి ఉన్నత విద్య కొనసాగేలా సహకారం అందిస్తున్నారు.



 గ్రామ మండలం జిల్లా స్థాయిలో మౌలిక వసతులు కల్పనా కోసం అధికారులతో మాట్లాడి పరిష్కరామర్గం చూపటం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందేలా తనదైన శైలితో సహాయం చెయ్యటం మొదలైన సేవా రాజకీయ మీడియా రంగాలలో ప్రజా మన్ననలు పొందుతూ.. సామాన్య అసమాన్య సేవా మూర్తిగా బీజేపీ నాయకుడు దుక్కేరి. ప్రభాకరరావును గొడుగుమామిడి గ్రామస్తులు మరియు పాస్టర్స్ దుస్సాలువ కప్పి ఘనంగా సత్కరించి సన్మానించారు. 



ఈ సందర్భంగా గొడుగుమామిడి, పిప్పలదొడ్డి గ్రామాలకు సౌకర్యవంతమైన తారోడ్డు నిర్మాణం తొందరగా జరిగేలా చూడలని గ్రామస్థులు తమ  ఆవేదన తెలిపారు,