శ్రామిక ఉత్సవము జయప్రదం చేయండి

సిఐటియు అఖిల భారత మహాసభల సందర్భంగా జరుగుతున్న శ్రామిక ఉత్సవంలో జిల్లా ప్రజలు పాల్గొని జయప్రదం చేయండి. 



ఈనెల 27 నుంచి జనవరి 2 వరకు విశాఖపట్నంలో ఏయూ కన్వెన్షన్ హాల్ వెనుక ఉన్న ఎగ్జిబిషన్ గ్రౌండ్లో శ్రామిక ఉత్సవం వారం రోజులు పాటు జరుగుతున్నది. ఈ పోస్టర్ ను మద్దిలపాలెం లో రిలీజ్ చేశారు. ఈ ఉత్సవంలో శ్రమ సంస్కృతి, నేషనల్ ఇంటిగ్రేషన్ వంటి సాంస్కృతిక కళారూపాలు, సైన్స్ ఎగ్జిబిషను, ఫోటో ఎగ్జిబిషను, కార్టూన్ ఎగ్జిబిషన్, బుక్ ఫెస్టివల్, సాహిత్య వేదిక, షార్ట్ ఫిలిం స్క్రీనింగ్ ఉంటాయి. శ్రమైక జీవన సౌందర్యాన్ని ప్రతిపాదించే విధంగా అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహించబడతాయి. లక్షకు పైగా పుస్తకాలు ప్రదర్శించటం మరియు అమ్మకం జరుగుతుంది  దీనితో పాటుగా హ్యూమన్ ఎనాటమీ, సైన్స్ ప్రాజెక్ట్లు, టెలిస్కోప్ తో ఆకాశవీక్షణం వంటివి ప్రత్యేక ప్రదర్శనగా ఉంటాయి  ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 9 గంటల వరకు అన్ని కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 వరకు జరుగుతాయి. ఈ శ్రామిక ఉత్సవo ను జిల్లా కలెక్టర్ ప్రారంభిస్తారు. సినీ ప్రముఖులు, స్థానిక కవులు, కళాకారులు జిల్లా అధికారులు పాల్గొంటారు.  కావున నగర ప్రజలందరూ కూడా శ్రామిక ఉత్సవం సందర్శించి విజ్ఞానంతో పాటు వినోదం పొందండి. ఈ జగతికి మూలం శ్రమ, సమాజానికి మూలమైన శ్రమ, శ్రమ యొక్క గొప్పతనాన్ని తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాలని సందర్శించవలసినదిగా కోరుతున్నాము. పోస్టర్ రిలీజ్ లో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక అజయ్ శర్మ అమరావతి బారోత్సవం రామరాజు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్, సిఐటియు నాయకులు కుమారి ప్రజానాట్యమండలి చంటి, రమణ పాల్గొన్నారు.