అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన ఐసీడిఎస్ పీడీ

అల్లూరి సీతారామరాజు జిల్లా, కొయ్యూరు మండలం లో అంగన్వాడీ కేంద్రాలను తనిఖీ చేసిన ఐసీడిఎస్ పీడీ.



నేడు కొయ్యూరు మండలం ఎం.మాకవరం తదితర గ్రామాల్లో శుక్రవారం అల్లూరి జిల్లా ఐసీడీఎస్ పిడి సూర్యలక్ష్మి తనిఖీలు చేశారు. ముందుగా ఆయా అంగన్వాడి కేంద్రాల్లో రికార్డులను పరిశీలించారు. అంగన్వాడి భోజనం పరిసరాలను కిచెన్, గార్డెన్లను పరిశీలించి, సంతృప్తి వ్యక్తం చేశారు. పూర్వ ప్రాథమిక విద్యలో భాగంగా ఐదేళ్లు పూర్తయిన అంగన్వాడి పిల్లలకు ఐసీడీఎస్ నుంచి సర్టిఫికెట్లను అందజేశారు.