వాలంటీర్ల ఉసురు పోసుకున్న వైకాపా నాయకులు

వారిస్వార్థ రాజకీయం కోసం వాలoటీర్లని భయపెట్టి బలి చేశారు. వాలంటీర్ల జీవనోపాధి ఫై మన్నుకొట్టినవారే భరోసా ఇవ్వగలరు. వాలంటీర్ల ఉసురు పోసుకున్న వైకాపా నాయకులు తినే అన్నంలో రాళ్లు కొట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు బోండ్ల చిరంజీవి.



అల్లూరి సీతారామరాజు జిల్లా: కొత్త ప్రభుత్వo ఏర్పాటుతో వాలంటీర్లలో అంతర్మదనం మొదలయ్యింది. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్టు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని కూటమి చెబుతున్న, అధికారం మా శాశ్వతం అన్నదోరణిలో గూడెం కొత్త వధిలో 99 మందిని చింతపల్లి 335 మందిని రాజీనామాలు చెసి ఎన్నికల ప్రచారంలో పాల్గోవాలని చెప్పి వైసీపీ నాయకులు బలవంతంగా రాజీనామాలు చేయించి వారు తినే అన్నంలో మన్నుకొట్టారు. రాజీనామాలు చెయ్యడానికి ఇష్టంలెని వారిని రాజీనామా చేసి ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనక పొతే మీ అంతు చూస్తాం అని బెదిరించి వారి పొట్టకొట్టరని బీజేపీ నాయకులు బొండ్ల చిరంజీవి ఫైరయ్యారు. ఆరోజు వారి జీవనాధారాన్ని మీఆధారంకోసం బలి చెసి ఇరోజు ఏమైపోయారు. ఎక్కడ దాకున్నారు వారి ప్రశ్నలకు సమాధానం చెప్పాలి అని చిరంజీవి డిమాండ్ చేశారు. 2019 న వైసీపీ ప్రభుత్వం ఏర్పడి వాలంటీర్ల నియామకాల సమయంలొ ఎంతోమంది దరఖాస్తులు చేసుకున్నా వారందరికీ కాదని ఇంటర్వ్యూలలో సెలక్ట్ కాని వాళ్ళను వారికి అణుగుణంగా వున్నవారికి ఎంపిక చేసుకోవడం జరిగింది. వాలంటీర్ ఎంపికలో అప్పటి అధికారులు ఇప్పుడున్న వైసీపీ నాయకులు 10000/ రూపాయల ముడుపులు తీసుకుని వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చారు. అనాడు ఎవరెవరు ఇంటర్యూలు చేసి తారుమారు చెసి అధికార దుర్వినియోగం కి పాల్పడ్డారు, వారందరూ మాకు గుర్తున్నారని చిరంజీవి హెచ్చరించారు. ఇ అయిదు ఏళ్లలో మండల శాఖలలో అధికారుల విధులకన్నా వైసీపీ నాయకులు డామినేషనే రాజ్యమేలింది. నోరువుంది కదా ఊరంతా మాదే అనట్టు అరిచారు, మీ మాటలకు బెదిరింపులకు దాడులకు ప్రజలు భయపడ్డారు అనుకున్నారు కానీ రాష్ర్టంలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా మీరూ భయపడేలా చేశారు. ఇంక మితిమీరి ప్రవర్తిస్తే భవిష్యత్ లేకుండా చేస్తారు గుర్తుపెట్టుకోండి. ఇప్పటితో వారి మాటలకు ఆటలకు కాలం చెల్లింది. ఇకనుండి ప్రజాపక్షం అయిన ప్రభుత్వం నడుస్తాది. ప్రజా ప్రభుత్వంలో ప్రజకు విలువలు పెరుగుతాయి . ఇన్నాళ్లు ప్రభుత్వ కార్యక్రమాలు వైసీపీ నాయకులు కనుసన్నల్లో జరిగేవి ఇప్పుడు ప్రజల భాగస్వామ్యంలో జరుగుతాయి. పాడేరులో కూటమి అధికారంలో లేకపోయినా కేంద్ర రాష్ర్ట ప్రభుత్వాల విజయంతో ప్రజలు అధికారంలో వున్నట్టే. బెదిరించి మీ చేత రాజీనామాలు చేయించిన వైసీపీ నాయకులను నిలదియండి. కూటమి ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను కొనసాగించాలని  నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం అర్హులు అందరికి అవకాశం కల్పిస్తాo. గిరిజన ప్రాంతంలో డిగ్రీ విద్యార్హత సడలింపు చెసి ఇంటర్ మిడియట్ అర్హత తో వాలంటీర్ ను నియమించాలి అని కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం . మేము ఇచ్చిన మాట నిలబెట్టుకునే దిశగా అడుగులు వేస్తాం. వైసీపీ నాయకులు రాజీనామాలు చేయించి మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుంది అని బెదిరించి తీయించిన మరియు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి గూడెం కొత్త వీధిలో 99 మందికి చింతపల్లి లో 335 మందికి వాలంటీర్ ఉద్యోగాలు ఇవ్వాలని వైసీపీ నాయకులు చిరంజీవి చురకలు అంటించారు.