ముస్లిం సోదరులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలిపిన అనకాపల్లి జిల్లా ఎస్పీ కె వి మురళికృష్ణ

జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రధాన మసీదులు, దర్గా ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు.

ప్రశాంత వాతావరణంలో ముస్లిం సోదరులు కుటుంబ సభ్యులతో సంతోషంగా బక్రీద్ పండుగ జరుపుకోవాలని ఆకాంక్ష: జిల్లా ఎస్పీ కె.వి. మురళీకృష్ణ ఐపీఎస్.



అనకాపల్లి జిల్లాలో 17వ తేదీన ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో అనకాపల్లి జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి, ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండగ జరుపుకునే విధంగా జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గోవులను ఒక చోట నుండి మరొక చోటుకు తరలించే క్రమంలో తగిన ధ్రువీకరణ పత్రాలను కలిగి ఉండవలెను, లేనిచో చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోబడును. గోవులను వధించడం పూర్తిగా నిషిద్ధం,చట్టాన్ని ఎవరైనా అతిక్రమిస్తే, అట్టివారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ఎస్పీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా గోవుల రవాణాపై నిరంతరం గట్టి నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా ఎవరైనా రెచ్చగొట్టే ప్రసంగాలు చేసినా,సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్ హెచ్చరించారు. బక్రీద్ పండుగ సందర్భంగా జిల్లాలో ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఉత్పన్నమయ్యే పరిస్థితులు ఉంటే, ప్రజలు వెంటనే అప్రమత్తమై అనకాపల్లి జిల్లా పోలీసు వాట్సాప్ నెంబర్ 94409 04229 కు సమాచారాన్ని అందించాలని జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఐపీఎస్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.