పోలవరం ప్రాజెక్టును పరిశీలించనున్న సీఎం చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన ఖరారైంది. సోమవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు చంద్రబాబు వెళ్లనున్నారు. పోలవరం ప్రాజెక్టు స్థితిని పరిశీలించనున్నారు. కాగా, సీఎంగా తొలి క్షేత్రస్థాయి పర్యటనను పోలవరం నుంచే ప్రారంభించనున్నారు. అనంతరం అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నారు.