హత్యో ...మరి ఆత్మ హత్యో....??



అనుమానాస్పదంగా చెట్టుకు వేలాడుతూ మృతదేహం కొయ్యూరు మండలం కేంద్రంలోని కూత వేటు దూరంలో వట్టి కాలువ ఒడ్డున ఓ చెట్టుకు గుర్తు తెలియని మృతదేహం వేలాడి ఉండటం స్థానికంగా చర్చనీయఅంశం అయింది. చెట్టుకు బాగా ఎత్తులో కొమ్మకు ఉరివేసుకున్నట్లుగా ఉన్న గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం బాగా కుళ్లిపోయి దుర్వాసన కొడుతుండడంతో ఈ సంఘటన జరిగే సుమారు నాలుగు ఐదు రోజులు గడిచి ఉంటుందని భావిస్తున్నారు. 



మృతదేహం మెడకు ముళ్లకంచేకు వినియోగించే ఇనుప తీగ ఉండడంతో అనుమానానికి  తావిస్తుంది. ఇది హత్య? లేక ఆత్మహత్య? అని సందేశం కలిగిస్తుంది. గుర్తు తెలియని వ్యక్తి ఏదో మనస్థాపనతో ఉరివేసుకునే ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడా. లేక ఏమైనా గొడవలు నేపథ్యంలో ఈ గుర్తు తెలియని వ్యక్తిపై ఎవరైనా  ఈ ఘతుకానికి పాల్పడి ఉంటారా. అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. సంఘటన స్థలానికి పోలీసులు కొయ్యూరు ఎస్సై రామకృష్ణ తమ సిబ్బందితో, వీఆర్వో మరియమ్మ తో కలిసి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటన స్థలంలో మృతుడు యొక్క చెప్పులు, కైని ప్యాకెట్ స్వాధీనం చేసుకున్నారు. మృతదేహంపై ఉన్న దుస్తులు బట్టి ఆ వ్యక్తిని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మిగతా వివరాలు ఎంక్వయిరీ చేసి మీడియాకు తెలియపరుస్తాం అని కొయ్యూరు ఎస్సై రామకృష్ణ తెలిపారు.