ఘనంగా మెగా టెక్స్ట్ టైల్ పార్క్ భూమి పూజ

మెగా టెక్స్ట్ టైల్ పార్క్ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నా మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ శ్రీ ఎన్.రాఘవేంద్ర రెడ్డి.



ఘనంగా స్వాగతం పలికిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డి.



కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని 75 ఎకరాలు చేయవల్సిన పనిని మొదటి విడత గా 20ఎకరాల్లో 6.6 కోట్ల నిధులతో టెక్సటైల్స్ పార్క్ భూమి పూజ కార్యక్రమానికి ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయ నాగేశ్వర్ రెడ్డి పిలుపుమేరకు మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి ఎన్.ఎం.డి ఫరూక్, భారీ పరిశ్రమలు మరియు ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మాత్యులు టీజీ భరత్ మరియు హ్యాండ్లూమ్స్ బీసీ సంక్షేమం అండ్ టెక్స్టైల్స్ శాఖ మాత్యులు సబిత మరియు టెక్స్ట్ టైల్స్ హ్యాండ్ లూం కమీషనర్ రేఖరాణి, జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాష, సబ్ కలెక్టర్ మౌర్య భారద్వాజ్, మంత్రాలయం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జి ఎన్.రాఘవేంద్ర రెడ్డి, కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటశ్వర్లు, మాజీ మంత్రి కె యి ప్రభాకర్ ఆదోని ఎమ్మెల్యే పార్థసారధి, ఆలూరు ఇంచార్జ్ వీరభద్ర గౌడ్, మరియు బిజెపి, జనసేన జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. 



అనంతరం మంత్రులు మరియు కమీషనర్, కలెక్టర్ చేనేత కార్మికుల కోసం కుటుంబ ప్రభుత్వం చేస్తున్న ఈ మంచి పని వారి జీవితాల్లో వెలుగులు నింపుతుందని అలాగే ఎమ్మిగనూరు చేనేత పట్టు వస్త్రాలను దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చే కార్యక్రమాన్ని చేపడతామని మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రాలయం నియోజకవర్గం నుండి ముఖ్య నాయకులు పాల్గొన్నారు.