“బాబు మ్యారిటీ – మోసం గ్యారంటీ” నినాదంతో కూటమి మోసాలను ఎండగడదాం!
కర్నూలు, జూన్ 29: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా విస్తృత స్థాయి సమావేశం కర్నూలు నగరంలోని లక్ష్మీ కల్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ శ్రీ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి జిల్లా పరిశీలకులు గంగుల ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు కార్యక్రమం జిల్లా అధ్యక్షులు యస్.వి. మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.
ఈ సందర్భంగా కూటమి పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం, అధికారంలోకి వచ్చాక మోసపూరిత పాలన సాగించడాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేలా రూపొందించిన “రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో”ను క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా ప్రజలకు అందించడానికి ప్రారంభించారు. “బాబు మ్యారిటీ – మోసం గ్యారంటీ” అనే నినాదంతో ప్రజలలో చైతన్యం రేకెత్తించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, జిల్లా పరిశీలకులు గంగుల ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, ఎన్నికల ముందు అలవి కాని హామీలతో ప్రజలను నమ్మించారని, ఇంటింటికీ హామీల బాండ్లు పంపించి అధికారంలోకి వచ్చారని, కానీ ఒక్క హామీకి కూడా న్యాయం చేయలేదని ధ్వజమెత్తారు. ‘సూపర్ సిక్స్’ పేరుతో ప్రజలను మభ్యపెట్టారని, హామీలు నెరవేర్చమంటే మక్కలు విరగ్గొడతామంటున్న పవన్ కళ్యాణ్‌కు ప్రజలే గట్టి సమాధానం చెబుతారన్నారు.
జిల్లా అధ్యక్షులు యస్.వి. మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ఒక్కో ఇంటికీ రూ.2.40 లక్షలు జమ అవుతాయంటూ బాండ్లు ఇచ్చిన చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇప్పుడు ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేని స్థితిలో ఉన్నారని వ్యాఖ్యానించారు. కొత్త పరిశ్రమలు వచ్చాయంటూ పచ్చ పత్రికల్లో పెయిడ్ ఆర్టికల్స్ వేయించుకున్నారని, వాస్తవానికి ఒక్క పరిశ్రమైనా తెచ్చారా అని నిలదీశారు.
ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ హామీలకు మోసపోయిన ప్రజలు ఇప్పుడు తీవ్ర పశ్చాత్తాపానికి గురవుతున్నారని పేర్కొన్నారు. ఏడాదిలోనే ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత నెలకొందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ మధుసూదన్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ, నిత్యావసర వస్తువుల ధరల పెంపు, భూమి రిజిస్ట్రేషన్ చార్జీల భారం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు భద్రత లేకపోవడం, చిన్నారులపై అఘాయిత్యాలు పెరుగుతుండటం తమ పాలన వైఫల్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. సమావేశంలో ప్రతి నియోజకవర్గంలో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం పెంచాలని, కూటమి మోసాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ప్రజల నమ్మకాన్ని మళ్లీ గెలుచుకునే దిశగా పార్టీ గట్టిగా అడుగులు వేస్తోందని నాయకులు స్పష్టంగా తెలిపారు.
ఈ కార్యక్రమం అనంతరం రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి మర్యాదపూర్వకంగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు, ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీమతి బుట్టా రేణుక ,పార్టీ సీనియర్ నాయకులు బుట్టా నీలకంఠ ,రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్ కలవడం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు మేయర్ బి.వై. రామమయ్య, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే బి.వీరుపాక్షి,పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి,పత్తికొండ మాజీ ఎమ్మెల్యే చేరుకులపాడు శ్రీదేవమ్మ, కర్నూలు మాజీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఇంచార్జ్ డా. సతీష్,ఎమ్మిగనూరు పార్టీ సీనియర్ నాయకులు బుట్టా శివ నీలకంఠ , రాష్ట్ర వీరశైవ లింగాయత్ సంఘ అధ్యక్షులు వై. రుద్రగౌడ్ , రాష్ట్ర యువజన విభాగ ఉపాధ్యక్షులు బుట్టా ప్రతుల్ తదితరులు పాల్గొన్న