ఎమ్మెల్యే వంశీ, మేయర్ సహకారానికి కృతజ్ఞతలు...కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, శ్రీధర్.
జీవీఎంసీ 41 వార్డులో ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తామని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 41వ వార్డు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం సమీపంలో రూ. 94.15 లక్షల జీవీఎంసీ నిధులతో పలు అభివృద్ధి పనులకు స్థానిక కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమతో కలిసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. 74.30 లక్షలతో దొండపర్తి జంక్షన్ పరిసర ప్రాంతాలలో తారు రోడ్డు సిసి రోడ్డు సీసీ కాలువలు కల్వర్టుల నిర్మాణం, అలాగే జ్ఞానాపురం బాబు కాలనీలో సీసీ రోడ్లు సీసీ కాలవలు, హోలీ క్రాస్ వీధిలో సీసీ కల్వర్టు నిర్మాణం రూ. 19.85 జీవీఎంసీ నిధులతో పనులు ప్రారంభానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీ మీడియాతో మాట్లాడుతూ కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ చెప్పిన విధంగా వార్డులో పెండింగ్ సమస్యలన్నింటినీ నెలలోపే పరిష్కరించే విధంగా నిధులు విడుదల చేయిస్తామని వెల్లడించారు.
మూడు నెలల లోపు పనులన్నింటినీ పూర్తి చేస్తామని ఎమ్మెల్యే వంశీ తెలిపారు. కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ, వైసిపి వార్డు అధ్యక్షుడు కోడిగుడ్ల శ్రీధర్ మాట్లాడుతూ వార్డులో ప్రజలు కోరుకున్న విధంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ 90% నెరవేర్చమన్నారు. పెండింగ్ పనులు ఎమ్మెల్యే వంశీ, మేయర్ పీలా శ్రీనివాసరావు దృష్టికి తీసుకు వెళ్ళామని, కౌన్సిల్లో పోరాడిన ఫలితం మేరకు 41 వ వార్డు ప్రజల ఎదుర్కొంటున్న సమస్యలన్నింటినీ పరిష్కరిస్తామని తెలిపారు. వార్డు పర్యటనకు వెళ్లేటప్పుడు ఇప్పటికే స్థానికులు కొన్ని సమస్యలు చెప్పారన్నారు. వీధి కుక్కల బెడద, అలాగే దేవాలయం పక్కన వీధిలైట్లు లేక అసంఘటి కార్యక్రమాలు గంజాయి బ్యాచ్ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసిందన్నారు. త్వరలో అక్కడి ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసే విధంగా మేయర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఉన్న ఈ నాలుగు నెలల్లోనే 41వ వార్డు ప్రజలు పెండింగ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు అక్కిరెడ్డి జగదీష్, 41వ వార్డ్ వైఎస్ఆర్సిపి శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.